Viral: వీడు మనిషా.. రాక్షసుడా.! పెళ్లి చేసుకోమన్నందుకు.. ఏకంగా బైక్‌తో యువతిని ఈడ్చుకెళ్లి..
Viral: బీహార్‌లోని నలంద జిల్లాలో చోటుచేసుకున్న ఒక అత్యంత భయానక ఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది.
Viral: వీడు మనిషా.. రాక్షసుడా.! పెళ్లి చేసుకోమన్నందుకు.. ఏకంగా బైక్‌తో యువతిని ఈడ్చుకెళ్లి..
Viral: బీహార్‌లోని నలంద జిల్లాలో చోటుచేసుకున్న ఒక అత్యంత భయానక ఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. కదులుతున్న బైక్ వెనుక ఒక యువతిని ఈడ్చుకెళ్లిన ఈ దారుణ సంఘటనకు..
సమాజంలో మానవత్వం మంటగలుస్తున్న తీరుకు అద్దం పట్టేలా వెలుగులోకి వస్తున్న కొన్ని సంఘటనలు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. బీహార్‌లోని నలంద జిల్లా పరిధిలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగు చూసింది. ఒక బైక్ పై వెళ్తున్న వ్యక్తి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, కదులుతున్న వాహనం వెనుక ఒక యువతిని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి చేసుకోవాలని యువతి పట్టుబట్టగా, ఆ వ్యక్తి అందుకు నిరాకరించి అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించడంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
బాధిత యువతి బైక్‌ను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, సదరు వ్యక్తి వాహనాన్ని ఆపకుండా మరింత వేగంగా పోనిచ్చాడు. దీనివల్ల ఆ యువతి కిందపడిపోయినా సరే సుమారు వంద మీటర్ల దూరం వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లిన వైనం చూస్తున్న వారి గుండెల్ని పిండేస్తోంది. ఈ భయానక దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఆ మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడిపోవడంతో, వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని గట్టిగా నిలదీశారు. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు సదరు వ్యక్తికి దేహశుద్ధి చేసినట్లు సమాచారం అందుతోంది.
కాగా, ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు నవాడా జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి అమిన్‌గా పోలీసుల విచారణలో వెల్లడైంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య పరిచయం ఉందని, వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. బాధితురాలి నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. మహిళలపై జరుగుతున్న ఇలాంటి అరాచక ఘటనలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




