భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం..ముక్కు కొరికిన భర్త, ప్రైవేట్ పార్ట్‌పై దాడి చేసిన భార్య..!
Bizarre Fight in UP: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. ప్రియుడితో వెళ్లిన భార్య పిల్లల కోసం రాగా.. భార్యాభర్తల మధ్య జరిగిన భీకర ఘర్షణలో ఒకరిపై ఒకరు పంటితో దాడి చేసుకున్నారు.
భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం..ముక్కు కొరికిన భర్త, ప్రైవేట్ పార్ట్‌పై దాడి చేసిన భార్య..!
Illegal affair: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా కేంద్రంలో అత్యంత విచిత్రమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. సాధన ,దీపక్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సాధన తన భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తను, పిల్లలను పూర్తిగా విస్మరించి ప్రియుడితో కలిసి సుమారు రెండున్నర నెలల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయింది.
కాలం గడుస్తున్న కొద్దీ పిల్లల జ్ఞాపకాలతో బాధపడటంతో.. సెప్టెంబర్ 17న తన పిల్లలను ఎట్టకేలకైనా తీసుకెళ్లాలని ఆమె నిర్ణయించుకుంది. ఎవరికీ తెలియకుండా నేరుగా పొరుగింటి పైకప్పు మీదుగా దొంగచాటుగా భర్త ఇంట్లోకి చొరబడింది. అకస్మాత్తుగా భార్య ఇంట్లో ప్రత్యక్షమవ్వడంతో దీపక్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. క్షణాల వ్యవధిలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అది పెద్ద ఘర్షణకు దారితీసింది.
ఈ గొడవలో ఇద్దరూ సంయమనం కోల్పోయి రాక్షసంగా దాడులకు పాల్పడ్డారు. తనపై భర్త దీపక్ తీవ్రంగా దాడి చేశాడని, తన ముక్కును పంటితో కొరికేసి సమీపంలోని కాలువలో పడేశాడని బాధితురాలు సాధన కన్నీటిపర్యూమమైంది. అంతేకాదు, ఆ సమయంలో తన అత్తమామలు చేతులు గట్టిగా పట్టుకుని భర్తకు సహకరించారని ఆమె ఆరోపించింది.
మరోవైపు దీపక్ కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సాధనే ముందుగా వచ్చి గొడవపెట్టిందని, పిల్లలను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసిందని చెప్పారు. పిల్లలను అడ్డుకున్న కోపంతో ఆమె ఏకంగా తన భర్త దీపక్ ప్రైవేట్ పార్ట్‌ను కొరికేసిందని ఎదురు ఆరోపణలు చేశారు. ఈ ఊహించని దాడితో ఇద్దరూ రక్తపు మడుగులో తీవ్ర గాలులపాలయ్యారు.
ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సాధనను స్థానికులు చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను విచారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, భర్త దీపక్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా మొదలైన ఈ గొడవ చివరకు పంటిపోట్లతో పోలీస్ స్టేషన్‌కు చేరడం స్థానికంగా సంచలనం సృష్టించింది.




