Viral Video: మొసలికి బ్రష్ వేసిన బుడ్డోడు.. ఇదెక్కడి విడ్డూరం సామీ!

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ వీడియో: ఏకంగా మొసలి నోరు తెరిచి పళ్లు తోమిన బాలుడు. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు. ఈ షాకింగ్ వీడియో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Arun Chilukuri
Published on: 22 April 2026 4:35 PM IST
Viral Video
X

Viral Video: మొసలికి బ్రష్ వేసిన బుడ్డోడు.. ఇదెక్కడి విడ్డూరం సామీ!

Viral Video: సోషల్ మీడియా యుగంలో రీల్స్ కోసం, వ్యూస్ కోసం జనం ఎలాంటి సాహసాలకైనా వెనుకాడటం లేదు. సాధారణంగా నీటిలో మొసలి ఉందంటే ఆ దరిదాపుల్లోకి వెళ్లడానికే గుండె జారిపోతుంది. 'నీటిలో మొసలికి పది ఏనుగుల బలం' అంటారు పెద్దలు. అలాంటిది ఒక చిన్న బాలుడు ఏకంగా మొసలి పళ్లు తోమిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక బాలుడు నీళ్ల దగ్గరకు వెళ్లి పిలవగానే ఒక మొసలి పిల్లిలా తన దగ్గరకు వచ్చింది. ఆ బాలుడు ఏమాత్రం భయం లేకుండా ఒక బ్రష్ తీసుకుని, ఆ మొసలి నోరు తెరిచి మరీ పళ్లను తోమడం ప్రారంభించాడు. పళ్ల మధ్య ఇరుక్కున్న మాంసపు ముద్దలను చాలా క్లీన్ గా బ్రష్‌తో శుభ్రం చేశాడు.

మరి ఆ బాలుడు దాన్ని మొదటి నుంచి పెంచుకుంటున్నాడో ఏమో కానీ, ఆ మొసలి కూడా ఎంతో ఓపిగ్గా, స్టైల్‌గా పళ్లు తోమించుకుంది. అతనిపై దాడి చేసే ప్రయత్నం ఏమాత్రం చేయకపోవడం గమనార్హం. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "అసలు ఆ మొసలికి అంత బుద్ధి ఏంటి?", "ఈ అబ్బాయి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే" అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అయితే ఇటువంటి సాహసాలు ప్రాణాంతకమని, ఎవరూ ప్రయత్నించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story