Brain Puzzle: ఈ పజిల్ చాలా సింపుల్, కానీ మీరు అస్సలు కనిపెట్టలేరు.. లాజిక్ తెలిస్తే ఇంతేనా అంటారు!
Brain Test Puzzle. నెటిజన్లకు మంచి కిక్ ఇస్తున్న ఒక క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ పజిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.
Brain Puzzle: ఈ పజిల్ చాలా సింపుల్, కానీ మీరు అస్సలు కనిపెట్టలేరు.. లాజిక్ తెలిస్తే ఇంతేనా అంటారు!
Brain Puzzle: శరీరానికి శక్తి కోసం ఆహారం ఎంత అవసరమో.. మన బుర్ర చురుగ్గా పనిచేయడానికి పజిల్స్ కూడా అంతే ముఖ్యం. లేకపోతే మెదడు మొద్దుబారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రకరకాల ఆప్టికల్ ఇల్యూషన్స్, ఫోటో పజిల్స్ తెగ హల్‌చల్ చేస్తున్నాయి. నెటిజన్లకు మంచి కిక్ ఇస్తున్న ఒక క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ పజిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
పది నిమిషాల్లో సాల్వ్:
ఈ పజిల్ ప్రత్యేకత ఏంటంటే.. ఎల్‌కేజీ, యూకేజీ చదివే చిన్న పిల్లలు అయితే దీనిని కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లో సాల్వ్ చేస్తారు. అదే పెద్ద చదువులు చదివిన వారికో, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్లకో అయితే దీనిని ఛేదించడానికి గంటల సమయం పడుతుంది. మరి మీ అపారమైన మేథాశక్తితో ఈ పజిల్‌ను ఎంతసేపట్లో పరిష్కరిస్తారో ఒకసారి చెక్ చేసుకోండి. వెంటనే ఆన్సర్ చూస్తే మాత్రం కిక్ పోతుంది. కాబట్టి కాస్త ఆలోచించి.. పజిల్‌ను పూర్తి చేయండి. ఇక నావల్ల కాదు బాబావోయ్ అనుకుంటే.. కింద ఉన్న సమాధానం చూడండి.
పజిల్ వివరాలు ఇవే:
పైన ఇచ్చిన చిత్రంలో కొన్ని సంఖ్యల కలయికలు, వాటికి సమానమైన ఫలితాలు ఉన్నాయి:
8809 = 6
7111 = 0
2172 = 0
6666 = 4
1111 = 0
3213 = 0
7662 = 2
9313 = 1
0000 = 4
2222 = 0
3333 = 0
5555 = 0
8193 = 3
8096 = 5
1012 = 1
7777 = 0
9999 = 4
7756 = 1
6855 = 3
9881 = 5
5531 = 0
వీటన్నిటినీ గమనించిన తర్వాత.. చివరగా ఇచ్చిన 2581 = ??? అనే ప్రశ్నకు సమాధానం ఏంటో చెప్పగలరా?. మీకు మరింత సమయం కావాలంటే పైకి స్క్రోల్ చేసి మరోసారి ట్రై చేయండి.
సమాధానం, లాజిక్:
ఏంటి.. ఎంత ట్రై చేసినా అస్సలు చిక్కు వీడటం లేదా?. అయితే ఆ సీక్రెట్ ఏంటో మేమే చెప్పేస్తాం. ఈ పజిల్ సాల్వ్ చేయడానికి ఎలాంటి పెద్ద పెద్ద మ్యాథ్స్ ఫార్ములాలు అవసరం లేదు. దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్. ఇక్కడ ఇచ్చిన ప్రతి నాలుగు అంకెల సంఖ్యలో ఎన్ని సున్నాలు (Circles/Loops) ఉన్నాయో లెక్కించడమే రహస్యం. చిన్న పిల్లలు కేవలం అంకెల ఆకారాన్ని మాత్రమే చూస్తారు కాబట్టి ఈజీగా కనిపెట్టేస్తారు.
ఉదాహరణ 1: మొదటి లైన్ లో ఉన్న 8809 ను తీసుకుంటే.. ఇందులో రెండు '8'లు ఉన్నాయి (అంటే 4 సర్కిల్స్), ఒక '0' ఉంది (1 సర్కిల్), ఒక '9' ఉంది (1 సర్కిల్). మొత్తం కలిపితే 6 సర్కిల్స్. అందుకే సమాధానం 6.
ఉదాహరణ 2: 0000లో నాలుగు సున్నాలు ఉన్నాయి కాబట్టి.. సమాధానం 4 అయింది.
అసలు ప్రశ్నకు సమాధానం:
ఇదే లాజిక్ ప్రకారం మిమ్మల్ని అడిగిన ప్రశ్న 2581 ను గమనిస్తే:
ఇందులో 2, 5, 1 లలో ఎలాంటి సున్నాలు (Circles) లేవు. కానీ '8' అనే అంకెలో మాత్రం 2 సర్కిల్స్ ఉన్నాయి. కాబట్టి 2581కి సరైన సమాధానం 2.
ఆలస్యం ఎందుకు:
'అరె.. ఇంత ఈజీ లాజిక్‌ను మిస్ అయ్యామే' అనిపిస్తుంది కదూ?. అంతే గురూ.. అందుకే అన్నారు బుర్రను కాస్త క్రియేటివ్‌గా వాడాలని. ఆలస్యం ఎందుకు పజిల్ అంజు మీ ఇంట్లో వారికి, బందువులకు షేర్ చేసి.. వారి బుర్రకు పరీక్ష పెట్టండి.




