Viral Video : బంజీ జంప్ ఘోరం.. తాడు కట్టకుండానే కిందకు వదిలేశారు.!
Viral Video : అడ్వెంచర్ స్పోర్ట్స్ (సాహస క్రీడలు) సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఎంత ప్రమాదకరంగా మారుతాయో నిరూపించే ఒక హృదయ విదారక ఘటన బ్రెజిల్‌లోని...
bungee jump accident
Viral Video : అడ్వెంచర్ స్పోర్ట్స్ (సాహస క్రీడలు) సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఎంత ప్రమాదకరంగా మారుతాయో నిరూపించే ఒక హృదయ విదారక ఘటన బ్రెజిల్‌లోని లైమీరాలో జరిగింది. బంజీ జంప్ చేయడానికి సిద్ధమైన ఒక 21 ఏళ్ల యువతికి కనీసం రక్షణ తాడు (సేఫ్టీ రోప్) కట్టకుండానే నిర్వాహకులు బ్రిడ్జ్ పైనుంచి కిందకు వదిలేశారు. దాంతో ఆ యువతి దాదాపు 130 అడుగుల ఎత్తు నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరణించిన యువతిని ఫిజికల్ ఎడ్యుకేషన్ , స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ అయిన మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్‌గా గుర్తించారు.
తాడు కట్టడం మరిచిపోయిన నిర్వాహకులు
మిలిటరీ పోలీసులు , అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న సిబ్బంది ఘోరమైన నిర్లక్ష్యం వహించారు. మరియాను బ్రిడ్జ్ పైనుంచి దూకించడానికి అన్ని ఏర్పాట్లు చేసిన సిబ్బంది, ఆమెకు కీలకమైన రక్షణ తాడును సరిగ్గా అమర్చడం పూర్తిగా మరిచిపోయారు. అది గమనించకుండానే ఆమెను ప్లాట్‌ఫారమ్ పైనుంచి కిందకు లాంచ్ చేశారు. దాంతో ఆమె సుమారు 40 మీటర్ల (130 అడుగులు) ఎత్తు నుండి నేరుగా కిందపడిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, అత్యవసర వైద్య బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ.. ఆమె కిందపడిన క్షణంలోనే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన భయంకర వీడియో
ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన పూర్తి దృశ్యాలు అక్కడ ఉన్న కొందరు కెమెరాల్లో రికార్డ్ చేయగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అందులో ఈవెంట్ క్రూ మరియాను ప్లాట్‌ఫారమ్ వైపు నడిపించుకుంటూ తీసుకువెళ్లడం కనిపిస్తుంది. ఆమె అక్కడి నుంచి కిందకు దూకిన వెంటనే, చుట్టుపక్కల ఉన్న జనాలు "అరేయ్.. తాడు, తాడు కట్టలేదు!" అని గట్టిగా అరుస్తున్న శబ్దాలు ఆ వీడియోలో స్పష్టంగా వినపడుతున్నాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అడవిలోకి పారిపోయిన నిర్వాహకులు.. ఆరుగురు అరెస్ట్
ప్రమాదం జరిగిన వెంటనే తప్పు తెలుసుకున్న ఈవెంట్ నిర్వాహకులు భయంతో అక్కడికక్కడే సామాన్లు వదిలేసి పక్కనే ఉన్న దట్టమైన అడవిలోకి పారిపోయారు. అయితే సమాచారం అందుకున్న మిలిటరీ పోలీసులు రంగంలోకి దిగి హెలికాప్టర్ సహాయంతో అడవిని జల్లెడ పట్టారు. పారిపోయిన నిందితులను విజయవంతంగా ట్రాక్ చేసి, ఈ ఘటనకు కారణమైన మొత్తం ఆరుగురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషాద ఘటనతో ప్రపంచవ్యాప్తంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వహణలో ఉండే భద్రతా లోపాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
A 21-year-old woman died during a 40-meter rope jump in Limeira, Brazil, after organizers forgot to attach the safety rope.pic.twitter.com/ECloIDRf2j
— Clash Report (@clashreport) June 13, 2026




