Viral Video: వామ్మో.. పెళ్లి తప్పించుకోవడానికి ఇంత క్రేజీ ప్లానా?!
Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ అవుతుంటాయి.
Viral Video: వామ్మో.. పెళ్లి తప్పించుకోవడానికి ఇంత క్రేజీ ప్లానా?!
Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే, మరికొన్ని విస్తుపోయేలా చేస్తాయి. ముఖ్యంగా నవ్వులు పూయించే ఫన్నీ వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్న ఒక క్రేజీ వీడియో చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. పెళ్లి వాయిదా వేసుకోవడం కోసం ఒక యువతి ఏకంగా గుండు గీయించుకుని అందరికీ మైండ్ బ్లాక్ చేసింది.
సాధారణంగా అమ్మాయిలకు జుట్టు అంటే పంచప్రాణాలు. పొరపాటున కొద్దిగా జుట్టు ఊడినా విలవిలలాడిపోతారు. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడం కోసం రకరకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఈ వీడియోలోని యువతి మాత్రం తన జుట్టును పూర్తిగా గుండు చేయించుకుంది. అంతేకాదు, అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్లుగా ఫీల్ అవుతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
"నా పెళ్లిని వాయిదా వేసుకోవడానికి నాకు ఇంతకన్నా మంచి ఐడియా ఇంకేమీ తట్టలేదు" అంటూ ఆ యువతి వీడియో కింద పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇటీవల కాలంలో చాలా మంది యువతీ యువకులు పెళ్లంటేనే భయపడి దూరంగా పారిపోతున్నారు. 30 ఏళ్లు దాటినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. కొందరైతే పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకోవడానికి, వాయిదా వేయడానికి రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. కానీ ఈ అమ్మాయి వేసిన ప్లాన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. "వాట్ ఏ క్రియేటివ్ థాట్.. జుట్టు పెరగడానికి కనీసం రెండేళ్లు పడుతుంది కాబట్టి.. అప్పటివరకు నో టెన్షన్" అని ఒకరు కామెంట్ చేయగా.. "ఒకవేళ మీ ఇంట్లో వాళ్లు విగ్గు పెట్టి పెళ్లి చేస్తే ఏం చేస్తావ్?" అంటూ మరొకరు ఫన్నీగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ గుండు సుందరి వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ ట్రెండ్ అవుతోంది.




