Maths Puzzle: మాస్టారు లెక్కలు బాగా వచ్చా.. 5 సెకన్లలో ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తే నువ్వే తోపు!

Maths Puzzle: Test your IQ with this viral math puzzle మీకు లెక్కలు బాగా వస్తే.. 5 సెకన్లలో ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తే నువ్వే తోపు.

Rishvik
Published on: 6 Jun 2026 7:14 PM IST
Maths Puzzle
X

Maths Puzzle: మాస్టారు లెక్కలు బాగా వచ్చా.. 5 సెకన్లలో ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తే నువ్వే తోపు!

Math Puzzle: ఫజిల్ గేమ్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన మెదడుకు వినోదాన్ని పంచడమే కాకుండా.. మన ఆలోచనా శక్తిని, తెలివితేటలను కూడా పెంచుతాయి. అందుకే వీటిని సాల్వ్ చేసేందుకు చాలా మంది ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని రకాల గణిత పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

చూడ్డానికి చాలా సులభంగా అనిపించినా.. కాస్త లోతుగా ఆలోచిస్తేనే కానీ వీటి గుట్టు విప్పలేము. ప్రస్తుతం అలాంటి ఒక గమ్మత్తైన ప్రశ్న ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. ప్రతి ఒకరు కుస్తీ పడుతున్నారు. మీకు లెక్కలు బాగా వస్తే.. 5 సెకన్లలో ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తే నువ్వే తోపు.

గణిత ప్రశ్న:

2 + 3 = 10

8 + 4 = 96

7 + 2 = 63

6 + 5 = 66

అయినప్పుడు 9 + 5 = ? అవుతుంది.

టాస్క్ ఏంటంటే:

మీకు ఇక్కడున్న టాస్క్ ఏంటంటే.. ఈ పజిల్ వెనుక ఉన్న లాజిక్‌ను కనిపెట్టి, కేవలం 5 సెకన్లలో సమాధానం చెప్పాలి. నిర్ణీత సమయంలో మీరు ఈ పజిల్‌ను పరిష్కరిస్తే.. నిజంగా మీ మెదడు చాలా చురుగ్గా పని చేస్తోందని అర్థం. అంతేకాదు మీకు అభినందనలు కూడా. ఒకవేళ మీరు ఎంత ప్రయత్నించినా దీని సమాధానం దొరకకపోయినా పర్లేదు. మేము ఆన్సర్ ఇస్తాం. ఎన్నోసార్లు ట్రై చేశాక మేము ఇచ్చే సమాధానం చూడండి. ఆ లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

లాజిక్ ఏంటంటే:

చాలా మంది ఈ పజిల్‌ను పరిష్కరించడం కష్టంగా భావిస్తారు. కానీ దీని వెనుక ఉన్న ఫార్ములా చాలా సింపుల్. ఈ పజిల్ యొక్క సరైన సమాధానం 126. ఇక్కడ ఇచ్చిన సమీకరణాల్లో మొదటి సంఖ్యను, ఆ రెండు సంఖ్యల మొత్తంతో గుణించాల్సి ఉంటుంది. లేదా విడివిడిగా మొదటి సంఖ్యతో రెండు సంఖ్యలను గుణించి కూడాలి.

గణన విధానం ఇలా:

మొదటి వరుస: 2+3=10→(2×2)+(3×2)=4+6=10 (లేదా 2×(2+3)=10)

రెండో వరుస: 8+4=96→(8×8)+(4×8)=64+32=96 (లేదా 8×(8+4)=96)

మూడో వరుస: 7+2=63→(7×7)+(2×7)=49+14=63 (లేదా 7×(7+2)=63)

నాల్గో వరుస: 6+5=66→(6×6)+(5×6)=36+30=66 (లేదా 6×(6+5)=66)

ఇదే లాజిక్‌ను ప్రశ్నకు వర్తింపజేస్తే:

9+5=(9×9)+(5×9)=81+45=126

(లేదా ఇంకా ఈజీగా చెప్పాలంటే: 9×(9+5)→9×14=126)

ఈ ప్రశ్న ఖచ్చితమైన సమాధానం 126. ఇంకెందుకు ఆలస్యం మీ స్నేహితులకు కూడా ఈ పజిల్‌ను షేర్ చేసి.. వారి తెలివితేటలకు పరీక్ష పెట్టండి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story