Dna Test: డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే మైండ్ బ్లాంక్.. ఏడేళ్లుగా సంసారం చేస్తున్న భార్య సొంత చెల్లెలు

Dna Test:: సరదాగా డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్న దంపతులకు షాక్. ఏడేళ్ల వైవాహిక జీవితం తర్వాత భార్యే కజిన్ అని తేలింది.

Naresh.k
Published on: 7 Aug 2026 2:32 PM IST
Dna Test
X

Dna Test: డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే మైండ్ బ్లాంక్.. ఏడేళ్లుగా సంసారం చేస్తున్న భార్య సొంత చెల్లెలు

DNA Test Cousin: సరదాగా కుటుంబ చరిత్రను తెలుసుకుందామని చేసిన ఒక చిన్న డీఎన్ఏ పరీక్ష.. ఆ దంపతుల ఏడేళ్ల వైవాహిక జీవితంలో ఊహించని తుఫాను రేపింది. ఎంతో అన్యోన్యంగా సంసారం చేస్తూ, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన భార్య.. వరుసకు సొంత చెల్లెలు అని తేలడంతో ఆ భర్త కాళ్ల కింద నేల ఒక్కసారిగా కదిలిపోయింది.

బోర్డ్ పాండా నివేదిక ప్రకారం.. టిక్‌టాక్‌లో @toothlessandruthless పేరుతో కంటెంట్ క్రియేట్ చేసే ఒక వ్యక్తి, తన భార్యతో కలిసి తమ పూర్వీకుల మూలాలను తెలుసుకోవాలని ఉత్సాహపడ్డాడు. ఇందుకోసం ఇద్దరూ జెనెటిక్ డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు. రిపోర్టులు చేతికి రాగానే చూసుకున్న ఆ దంపతులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజం తెలిసింది. వారిద్దరి మధ్య అత్యంత దగ్గరి రక్తసంబంధం ఉందని ఆ రిపోర్ట్ తేల్చేసింది.

ఇంత పెద్ద కుటుంబ బంధం ఇరువైపుల పెద్దలకు కూడా ఎలా తెలియకుండా పోయిందనే సందేహం అందరిలోనూ రాక మానదు. దీనిపై సదరు క్రియేటర్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. అతడి నానమ్మ, అలాగే భార్య తరఫు అమ్మమ్మ ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు. చాలా కాలం క్రితమే ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోయి, వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయాయి. కాలక్రమేణా పాత బంధాల గురించి ఎవరూ మాట్లాడుకోకపోవడంతో, వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకునే సమయానికి ఈ రక్తసంబంధం గురించి కుటుంబంలో ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా పోయింది.

ఈ నిజం తెలిసినప్పటి నుంచి ఆ వ్యక్తి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఏడేళ్లుగా ఎంతో ప్రేమగా చూసుకున్న నా భార్యే నా కజిన్ అని తెలిసింది. ఇప్పుడు మేము ఏం చేయాలి? విడాకులు తీసుకోవాలా? మా ఇద్దరి పిల్లల భవిష్యత్తు ఏంటి? అంటూ సోషల్ మీడియా వేదికగా కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్ అయి, కోట్లాది మంది దృష్టిని ఆకర్షించింది.

ఈ విచిత్ర ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆరోగ్య నిపుణుల సూచన: దగ్గరి రక్తసంబంధీకుల మధ్య వివాహాలు జరగడం వల్ల పుట్టబోయే పిల్లలకు థలసేమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి తీవ్రమైన జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెంటనే పిల్లలకు వైద్య పరీక్షలు చేయించాలని, జెనెటిక్ కౌన్సెలర్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికే పెళ్లయి ఏడేళ్లవుతోంది. ఇద్దరు ముద్దుల పిల్లలు ఉన్నారు. గతంలో జరిగిన పొరపాటుకు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న సంసారాన్ని కూల్చుకోవద్దు. మానసిక ప్రశాంతత కోసం ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ముందుకు సాగండి అని పలువురు సలహా ఇస్తున్నారు. అనుకోకుండా వెలుగులోకి వచ్చిన ఈ డీఎన్ఏ రహస్యం ఆ కుటుంబంలో రేపిన అలజడి ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story