Viral Video: డ్రైవరన్నా.. నువ్వే రియల్ హీరోవి.. దూరం నుంచి రోడ్డుపై కనిపించిన చిన్నారి.. కట్ చేస్తే
Viral Video: కేరళలోని మలప్పురంలో ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. హైవే మీదకు పాకుతూ వచ్చిన ఓ చిన్నారి ప్రాణాలను, ఓ బస్సు డ్రైవర్ తన సమయస్ఫూర్తితో తృటిలో కాపాడాడు.
Viral Video: డ్రైవరన్నా.. నువ్వే రియల్ హీరోవి.. దూరం నుంచి రోడ్డుపై కనిపించిన చిన్నారి.. కట్ చేస్తే
Viral Video: రోడ్డు పక్కన ఇల్లు ఉన్నవారు చిన్నపిల్లల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరించే ఒక షాకింగ్ ఘటన కేరళలో వెలుగుచూసింది. బిజీగా ఉండే హైవేపైకి ఏమాత్రం ఊహించని విధంగా పాకుతూ వచ్చిన ఓ పసిబిడ్డను ఒక బస్సు డ్రైవర్ రియల్ హీరోలా కాపాడాడు. కేరళలోని మలప్పురంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
మలప్పురం పరిధిలోని ఒక రద్దీ రహదారిపై వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. అదే సమయంలో, రోడ్డు పక్కన ఉన్న ఇంట్లో నుంచి ఒక చిన్నారి ఆడుకుంటూ ఎవరూ గమనించని సమయంలో ఏకంగా హైవేపైకి పాకుతూ వచ్చేసింది. చిన్నారి హైవే మధ్యలోకి వస్తున్న దృశ్యాలు బస్సు డాష్ కెమెరాలో రికార్డయ్యాయి. సరిగ్గా అదే సమయంలో ఆ మార్గంలో ఒక ప్రైవేట్ బస్సు వేగంగా వస్తోంది. బస్సు నడుపుతున్న డ్రైవర్ అదృష్టవశాత్తూ దూరం నుంచే రోడ్డుపై పాకుతున్న చిన్నారిని గమనించాడు. వెంటనే అప్రమత్తమైన అతడు తన సమయస్ఫూర్తిని ఉపయోగించి బస్సును చాకచక్యంగా కంట్రోల్ చేసి, చిన్నారికి కొద్ది దూరంలోనే సడెన్ బ్రేక్ వేశాడు.
బస్సును ఆపివేసిన వెంటనే, డోర్ తెరిచి స్థానికులను, బస్సులోని వారిని అప్రమత్తం చేశాడు. దీంతో అక్కడున్న వారు వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ పసిబిడ్డను సురక్షితంగా రోడ్డు పక్కకు తీసుకువచ్చారు. ఆ తర్వాత చిన్నారి తల్లిదండ్రులు కంగారుగా పరిగెత్తుకుంటూ రావడం వీడియోలో కనిపించింది.
కెమెరాలో రికార్డైన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. డ్రైవర్ అప్రమత్తత, అతడి సమయస్ఫూర్తి వల్లే ఒక నిండు ప్రాణం దక్కిందని, అతడు 'రియల్ హీరో' అని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో, ఈ ఘటన తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక లాంటిది. రోడ్ల పక్కన నివాసం ఉండేవారు పసిపిల్లలు ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడుకోవాలని, తలుపులు లేదా గేట్లు ఎప్పుడూ మూసి ఉంచాలని పోలీసులు, నెటిజన్లు సూచిస్తున్నారు.




