Viral Video : డ్యాన్స్ చేస్తూ కెమిస్ట్రీ.. పెరియాడిక్ టేబుల్ అదిరేలా నేర్చుకుంటున్న స్టూడెంట్స్.!

G Krishna
Published on: 14 Aug 2026 3:38 PM IST
Chemistry Class
X

Chemistry Class

రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ) అనగానే చాలామంది విద్యార్థులకు ఆ సంకేతాలు, మూలకాల (Chemical Elements) పేర్లు, అలాగే సుదీర్ఘమైన పెరియాడిక్ టేబుల్‌ను క్రమంలో గుర్తుపెట్టుకోవడం ఒక పెద్ద సవాలుతో కూడుకున్న పని. ఎగ్జామ్స్ సమయంలో ఈ ఎలిమెంట్స్ గుర్తురాక ఎంతోమంది కంగారు పడుతుంటారు. కానీ కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఒక ఉపాధ్యాయుడు మాత్రం తన వినూత్న ఆలోచనతో, క్రియేటివిటీతో ఆ కష్టమైన పాఠాన్ని ఎంతో సరదాగా, మర్చిపోలేని విధంగా మార్చేశారు. ప్రసిద్ధ బాలీవుడ్ పాట ఈణాన్ని ఉపయోగించి, క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థులతో డ్యాన్స్ చేయిస్తూ పెరియాడిక్ టేబుల్‌ను ఎంతో ఈజీగా బైహాట్ చేయిస్తున్నారు.

'డ్రీమమ్ వేకపమ్' ట్యూన్‌తో రసవత్తరంగా కెమిస్ట్రీ క్లాస్..

ఆకాష్ స్వరూప అనే ఉపాధ్యాయుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ బోధనకు సంబంధించిన వీడియోను షేర్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఆయన క్లాస్‌రూమ్‌లోని బ్లాక్‌బోర్డ్‌పై పెరియాడిక్ టేబుల్‌లోని మూలకాల పేర్లను ఒక క్రమంలో రాసి ఉంచారు. చేతిలో ఒక స్కేల్ పట్టుకుని బోర్డుపై ఉన్న ఒక్కో ఎలిమెంట్‌ను చూపిస్తూ, ఒక ప్రత్యేకమైన రిథమిక్ స్టైల్‌లో వాటిని పాటలా పాడుతున్నారు. ఆయన పాడే తీరును కొద్దిసేపు గమనిస్తే.. అది 2012లో రాణి ముఖర్జీ నటించిన 'అయ్యా' (Aiyyaa) సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ 'డ్రీమమ్ వేకపమ్' (Dreamum Wakeupum) ట్యూన్ అని స్పష్టంగా అర్థమవుతుంది.

క్లాస్‌రూమ్‌లో మినీ పెర్ఫార్మెన్స్.. టీచర్‌తో కలిసి విద్యార్థుల డాన్స్

టీచర్ అంత ఎనర్జెటిక్‌గా పాట పాడుతుంటే విద్యార్థులు ఊరికే ఉంటారా? బెంచీల దగ్గర నిలబడి క్లాస్‌రూమ్‌లోని విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా ఆయనతో కలిసి పాడుతూ స్టెప్పులేశారు. కెమిస్ట్రీ క్లాస్ కాస్తా ఒక మినీ సంగీత విభావరిని, డాన్స్ ఫ్లోర్‌ను తలపించింది. ఆకాష్ స్వయంగా విద్యార్థులతో కలిసి ఎగురుతూ, డ్యాన్స్ చేస్తూ ఆ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చేశారు. సాధారణంగా విద్యార్థులకు బోర్ కొట్టే లేదా కష్టంగా అనిపించే మూలకాల జాబితాను కేవలం పుస్తకాల్లో చూసి చదవడం కంటే, ఇలా విజువల్‌గా, మ్యూజికల్‌గా నేర్చుకోవడం వల్ల పిల్లల మైండ్‌లో అది లైఫ్‌లాంగ్ ప్రింట్ అయిపోతుందని ఈ టీచర్ నిరూపించారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసల జల్లు & సరదా కామెంట్స్

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి, విద్యావేత్తల నుంచి విశేష స్పందన లభిస్తోంది. "మన చిన్నప్పుడు కూడా ఇలాంటి క్లాసెస్, ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న టీచర్లు ఉంటే కెమిస్ట్రీలో మనకు వందకు వంద మార్కులు వచ్చేవి!" అని కొందరు నెటిజన్లు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "ఇలాంటి ఎంటర్‌టైనింగ్ అండ్ ఎంగేజింగ్ వేలో పాఠాలు చెబితే పిల్లలు లైఫ్‌లో ఆ లెసన్ మర్చిపోలేరు" అని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక మరికొందరైతే "ఈయన యాక్చువల్‌గా డాన్స్ ఆర్టిస్ట్ లేదా మ్యూజిక్ టీచర్ అవ్వాల్సిన వ్యక్తి.. పొరపాటున కెమిస్ట్రీ టీచర్ అయినట్లున్నారు!" అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా, బోరింగ్ పాఠాలను కూడా ఇంత ఇంట్రెస్టింగ్ గేమ్ లాగా మార్చిన ఈ టీచర్ క్రియేటివిటీకి అందరూ హాట్సాఫ్ చెబుతున్నారు.




G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story