Viral Video : మనసు గెలిచిన దంపతులు.. ఈ వీడియో చూస్తే మీరు కూడా అంటారు..!

Viral Video : ఈ రోజుల్లో మనుషులే ఒకరినొకరు పట్టించుకోని పరిస్థితులు చూస్తున్నాం. అలాంటిది నోరులేని మూగజీవాల పట్ల ఒక కుటుంబం చూపించిన ప్రేమ, దయ సోషల్..

G Krishna
Published on: 20 July 2026 7:55 PM IST
Viral-Video
X

Viral-Video

Viral Video : ఈ రోజుల్లో మనుషులే ఒకరినొకరు పట్టించుకోని పరిస్థితులు చూస్తున్నాం. అలాంటిది నోరులేని మూగజీవాల పట్ల ఒక కుటుంబం చూపించిన ప్రేమ, దయ సోషల్ మీడియాలో లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది. చెన్నైకి చెందిన ఒక దంపతులు కుండపోత వర్షంలో వీధి కుక్కను, దానికి కొత్తగా పుట్టిన పిల్లలను రక్షించిన తీరు ఇప్పుడు నెటిజన్ల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటోంది.

వర్షంలో నవజాత పిల్లలతో తల్లి కుక్క ఆరాటం

చెన్నైకి చెందిన రీతూ అనే యువతి ఈ మనసును హత్తుకునే ఘటనను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో రూపంలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రీతూ తెలిపిన వివరాల ప్రకారం.. వారి ఇంటి సమీపంలో ఉండే ఒక వీధి కుక్క భారీ వర్షం కురుస్తున్న సమయంలో పిల్లలకు జన్మనిచ్చింది. ఒకవైపు వర్షం, మరోవైపు దుమ్ముధూళితో నిండిన ఏమాత్రం సురక్షితం కాని చోట, కొత్తగా పుట్టిన చిన్నారి పిల్లలను కాపాడుకోవడానికి ఆ తల్లి కుక్క పడుతున్న ఆరాటం రీతూ తల్లిదండ్రుల కంటపడింది. ఆ వానలో పిల్లలు తడిసిపోతుంటే తల్లి కుక్క పడుతున్న తపన వారిని ఎంతగానో కలిచివేసింది.

గొడుగు పట్టి.. ప్లాస్టిక్ టబ్‌లో..

ఆ మూగజీవాల కష్టాన్ని చూసి చలించిపోయిన రీతూ తల్లిదండ్రులు చేసిన పని అందరిని ఆకర్షించింది. వర్షంలో తడవకుండా ఉండేందుకు ఒక చేత్తో గొడుగు పట్టుకుని, మరో చేత్తో ప్లాస్టిక్ టబ్‌లో ఆ చిన్నారి కుక్క పిల్లలను భద్రంగా పెట్టుకుని ఆమె తల్లి ముందుకు సాగింది. తమ పిల్లలను సురక్షితంగా తీసుకెళ్తున్నారని గ్రహించిన తల్లి కుక్క కూడా ఆప్యాయంగా వారి వెనకాలే నడుస్తూ రావడం ఆ వీడియోలో అందరినీ ఆకట్టుకుంది.

వెచ్చని బెడ్.. ఆహారం ఏర్పాటు..

పిల్లలను, తల్లి కుక్కను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న తమ ఇంటిపై అంతస్తులోని ఒక మూలను శుభ్రం చేశారు. ఆ జీవాల కోసం వెచ్చనిచిన్న బెడ్‌ను సిద్ధం చేసి, తడిసిన ఆ పిల్లలను, తల్లి కుక్కను మెల్లగా తుడిచి పొడిగా మార్చారు. ఆ వెంటనే వాటికి కడుపునిండా ఆహారం, తాగునీరు అందించి సురక్షితమైన ఆశ్రయాన్ని కల్పించారు. చలికి వణకకుండా ఆ మూగజీవాలకు ఆ కుటుంబం కొండంత అండగా నిలిచింది.

మా అమ్మనాన్నలను చూసి గర్విస్తున్నాను

ఈ హార్ట్ టచ్చింగ్ ఘటనపై రీతూ స్పందిస్తూ.. "ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మా తల్లిదండ్రులు చూపించిన ఈ మానవత్వాన్ని చూస్తుంటే, సమాజంలో ఇంకా మంచితనం బతికే ఉందనే నమ్మకం కలుగుతోంది. వారిని చూసి నేను ఎంతగానో గర్వపడుతున్నాను" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్.. ప్రశంసల వెల్లువ

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ దంపతుల నిస్వార్థ సేవ మానవత్వంపై ఆశలను చిగురింపజేసిందని, ఆపదలో ఉన్న మూగజీవాలకు ఆశ్రయం కల్పించి వాటి ప్రాణాలు కాపాడినందుకు నెటిజన్లు కామెంట్ల రూపంలో వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. "ఇలాంటి మంచి మనసు ఉన్నవారు ఉన్నారంటే సమాజం ఇంకా బాగుంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story