Viral News : 38 వేల కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై.. టీ కొట్టుతో నెలకు లక్ష లాభం..!
Viral News : కార్పొరేట్ ఉద్యోగం, నెల నెలా చేతికి అందే జీతం.. చాలామందికి ఇది ఒక సురక్షితమైన జీవితంలా కనిపిస్తుంది. కానీ, ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు
tea-shop
Viral News : కార్పొరేట్ ఉద్యోగం, నెల నెలా చేతికి అందే జీతం.. చాలామందికి ఇది ఒక సురక్షితమైన జీవితంలా కనిపిస్తుంది. కానీ, ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే రొటీన్ లైఫ్, పరిమితమైన ఎదుగుదలతో విసిగిపోయి సొంతంగా ఏదైనా సాధించాలని తపించేవారు కూడా ఉన్నారు. అయితే, ఉద్యోగం వదిలి రిస్క్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ధైర్యం చేయలేరు. కానీ, ఒక యువకుడు మాత్రం తన రూ.38,000 జీతాన్ని ఇచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి, రోడ్డు పక్కన ఒక చిన్న టీ కొట్టు ప్రారంభించాడు. ఈ రోజు అతని డెసిషన్ అతని జీవితాన్నే మార్చేసింది. ఆసక్తికరమైన ఈ సక్సెస్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనం
ఈ స్ఫూర్తిదాయకమైన కథనాన్ని 'అంకిత్ పాండే' అనే యూజర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తన పొరుగింటి వ్యక్తి గతంలో 'టెలిపెర్ఫార్మెన్స్' అనే ప్రముఖ కంపెనీలో నెలకు రూ.38,000 జీతానికి పనిచేసేవాడు. అయితే, ప్రతి నెలా పెరుగుతున్న ఖర్చులు, ఉద్యోగంలో ఆశించినంత ఎదుగుదల లేకపోవడంతో విసిగిపోయి మే నెలలో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అతడు ఉద్యోగం వదిలేసినప్పుడు, జీవితంలో పెద్ద తప్పు చేస్తున్నాడని అందరూ అనుకున్నారు.
రూ.2 లక్షల పెట్టుబడి.. వినూత్న ఆలోచన
అందరి మాటలను పక్కనబెట్టి, తన నిర్ణయంపై నమ్మకంతో ఆ యువకుడు ముందడుగు వేశాడు. ఒక ఆటో స్టాండ్ సమీపంలో టీ స్టాల్ ఏర్పాటు చేయడానికి సుమారు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. షాప్‌ను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, టీ తయారు చేయడంతో పాటు కస్టమర్లకు అందించడానికి ఇద్దరు మహిళా ఉద్యోగులను కూడా నియమించుకున్నాడు. టీ ధరలను కూడా అందరికీ అందుబాటులో ఉండేలా సాధారణ టీ రూ.10, ప్రీమియం టీ రూ.20 గా నిర్ణయించాడు.
నెలకు లక్ష రూపాయల నికర లాభం
ఆటో స్టాండ్ దగ్గర షాప్ ఉండటం వల్ల ప్రతిరోజూ కస్టమర్ల రద్దీ బాగా పెరిగింది. ప్రస్తుతం ఈ టీ స్టాల్‌లో రోజుకు సగటున 400 కప్పుల టీ విక్రయమవుతోంది. దీనివల్ల రోజువారీ రాబడి దాదాపు రూ.6,000 కాగా, నెలకు మొత్తం టర్నోవర్ రూ.1.8 లక్షలకు చేరుకుంది. దుకాణం అద్దె, విద్యుత్ బిల్లు, సిబ్బంది జీతాలు, , పాలు, టీపౌడర్, చక్కెర వంటి ముడిసరుకుల ఖర్చులన్నీ పోను అతనికి నెలకు ఏకంగా రూ.1 లక్ష నికర లాభం మిగులుతోంది.
స్నాక్స్ కౌంటర్‌తో వ్యాపార విస్తరణ
టీ స్టాల్ లభించిన సక్సెస్‌తో ఈ యువ వ్యాపారవేత్త తన వ్యాపారాన్ని మరింత విస్తరించాడు. ఇటీవల తన టీ స్టాల్ వద్ద వడా పావ్, సమోసా, , జిలేబీ కోసం ఒక కొత్త స్నాక్స్ కౌంటర్‌ను కూడా ప్రారంభించాడు. ఈ కొత్త ప్రారంభానికి గుర్తుగా తన పొరుగున ఉన్న అంకిత్‌కు స్వీట్ బాక్స్ ఇవ్వడంతో ఈ విజయం వెలుగులోకి వచ్చింది.
ఒకవేళ అతడు పాత ఉద్యోగంలోనే ఉండి ఉంటే, ఇప్పటికీ అదే రూ.38,000 జీతంతో తదుపరి ఇంక్రిమెంట్ కోసం ఎదురుచూస్తూ ఉండేవాడని అంకిత్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఒక్కోసారి మన జీవితంలో మనం సాధించే అతిపెద్ద ఎదుగుదల.. మనకు మనంగా ధైర్యంతో తీసుకునే నిర్ణయాల్లోనే దాగి ఉంటుంది..




