Earthquake: భూకంపం ధాటికి పక్కకు జరిగిన దేశం ఏదో తెలుసా..?

Earthquake: భూకంపాల ధాటికి ఒక దేశం రెండు అడుగులు పక్కకు జరిగింది.

Naresh.k
Published on: 27 July 2026 11:50 AM IST
Earthquake
X

Earthquake: భూకంపం ధాటికి పక్కకు జరిగిన దేశం ఏదో తెలుసా..?

Venezuela: వెనిజులా దేశంలో సంభవించిన శక్తివంతమైన జంట భూకంపాలు భౌగోళిక వ్యవస్థలో ఊహించని మార్పులకు దారితీశాయి. భూకంప ధాటికి అక్కడి భూమి ఉపరితలం ఏకంగా 60 సెంటీమీటర్లు అంటే రెండు అడుగుల మేర పక్కకు జరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంప తీవ్రతకు భూభాగం ఇంతలా కదిలిపోవడం ప్రపంచవ్యాప్తంగా సైన్స్ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ,భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన నిసార్ ఉపగ్రహం పంపిన సేకరించిన అత్యంత ఖచ్చితమైన రేడార్ సమాచారం ఆధారంగా ఈ విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది.

వెనిజులా ఉత్తర తీరప్రాంతంలో 7.2 , 7.5 రిక్టర్ స్కేలు తీవ్రతలతో సంభవించిన వరుస వినాశకర భూకంపాల ప్రభావం సాధారణంగా ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది. రాజధాని కారకాస్ సమీపంలోని బిజీగా ఉండే సైమన్ బొలీవర్ అంతర్జాతీయ విమానాశ్రయం , లా గ్వైరా ప్రాంతాల మధ్య ఉన్న భూభాగం పశ్చిమ దిశగా నెట్టబడింది. కరేబియన్, దక్షిణ అమెరికా టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల్లో ఉన్న సాన్ సెబాస్టియన్ ఫాల్ట్ లైన్ వెంబడి క్షితిజ సమాంతరంగా భూమి హఠాత్తుగా కదలడం వల్లే అక్కడి భవనాలు, రోడ్లు, రన్‌వేలు , ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు ఉపగ్రహ పరిశోధనలు స్పష్టం చేశాయి.

అంతరిక్షం నుంచి ఇన్సార్ అధునాతన పరిజ్ఞానంతో సేకరించిన శాటిలైట్ చిత్రాలను భూకంపానికి ముందు, ఆ తర్వాత పోల్చి చూసి నాసా-ఇస్రో శాస్త్రవేత్తలు ఈ భౌగోళిక మార్పును మిల్లీమీటర్లతో సహా సరిగ్గా కొలవగలిగారు. విశేషమేమిటంటే.. ఒక భారీ భూకంపం సంభవించిన వెంటనే ఉపరితలంలో సంభవించే అత్యంత వేగవంతమైన కదలికలు, విపత్తు తీవ్రతను తక్షణమే నమోదు చేయడానికి నాసాకు చెందిన నిసార్ ఉపగ్రహంలో ఉండే అర్జెంట్ రెస్పాన్స్ వ్యవస్థను ఉపయోగించడం ఇదే తొలిసారి.

భవిష్యత్తులో భూకంపాల ముప్పును అంచనా వేయడానికి, విపత్తు నిర్వహణలో వేగవంతమైన సహాయక చర్యలు అందించడానికి నాసా-ఇస్రో సంయుక్త నిసార్ ఉపగ్రహ సాంకేతికత ఓ సరికొత్త మార్గదర్శకంగా నిలవబోతోంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story