Viral Video : ప్రేమంటే గిఫ్ట్‌లు కాదు.. ఈ వీడియోనే సాక్ష్యం.!
Viral Video : ప్రేమను వ్యక్తపరచడానికి పెద్ద పెద్ద బహుమతులు, ఆడంబరమైన సర్‌ప్రైజ్‌లు అవసరం లేదు. దినచర్యలో భాగమయ్యే అతి సాధారణమైన చిన్న చిన్న
old-couple-viral-video
Viral Video : ప్రేమను వ్యక్తపరచడానికి పెద్ద పెద్ద బహుమతులు, ఆడంబరమైన సర్‌ప్రైజ్‌లు అవసరం లేదు. దినచర్యలో భాగమయ్యే అతి సాధారణమైన చిన్న చిన్న పనుల్లోనే అసలైన అనురాగం, ఆప్యాయత దాగి ఉంటాయని నిరూపిస్తోంది ఒక సంఘటన. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వృద్ధ దంపతుల వీడియో నెటిజన్ల హృదయాలను పిండేస్తోంది. ఒక మహిళను కంటితడి పెట్టించిన ఈ భావోద్వేగ దృశ్యం, చూసిన ప్రతి ఒక్కరినీ "నిజమైన ప్రేమంటే ఇదే కదా" అని అనుకునేలా చేస్తోంది.
సాదాసీదా దృశ్యం.. కొండంత అనురాగం
అస్సాంకు చెందిన ఐటీ రిక్రూటర్ షానా ఈ అద్భుతమైన ఘట్టాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఒక ఇంట్లో భోజనం చేసే సమయంలో జరిగే సన్నివేశమే ఆ వీడియోలో కనిపిస్తుంది. ఒక వృద్ధుడు తన రెండు చేతుల్లో రెండు భోజనం ప్లేట్లను ఎంతో జాగ్రత్తగా పట్టుకుని వస్తాడు. ఆహారం ఏమాత్రం కింద పడకుండా చిన్న చిన్న అడుగులు వేస్తూ, అప్పటికే డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఉన్న తన భార్య దగ్గరకు వెళ్తాడు. ఎంతో ఆప్యాయంగా, మురిపెంగా ఒక ప్లేట్‌ను ఆమె ముందు ఉంచి, మరో ప్లేట్‌ను తన ముందు పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆమెకు ఎదురుగా కూర్చుని, ముఖంలో ఒక అందమైన చిరునవ్వు చిందిస్తూ ఇద్దరూ కలిసి ప్రశాంతంగా భోజనం చేయడం ప్రారంభిస్తారు.
కన్నీళ్లు తెప్పించిన క్షణం..
ఈ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూసిన షానా తన ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్‌లో భావోద్వేగానికి లోనవుతూ రాసుకొచ్చారు. భార్య కోసం భోజనం ప్లేట్ మోసుకురావడం బాహటంగా చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు కానీ, ఆ క్షణంలో ఆయన చూపించిన శ్రద్ధ, సంరక్షణ , ప్రేమ మాటలకు అందనంత గొప్పవని ఆమె పేర్కొన్నారు. ఈ దృశ్యం చూస్తున్నంతసేపు తన హృదయం ఎంతో హాయిగా అనిపించిందని, తెలియకుండానే కళ్లమ్మట నీళ్లు తిరిగాయని చెప్పారు. భవిష్యత్తులో తనకు రాబోయే భాగస్వామితో కూడా ఇలాంటి అన్యోన్యమైన, ప్రేమపూర్వకమైన అనుబంధమే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు.
"రియల్ కపుల్ గోల్స్" అంటున్న నెటిజన్ల..
ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన కొద్దిసేపటికే విపరీతంగా వైరల్ అయి, వేలాది మంది నెటిజన్ల మనసులను దోచుకుంది. ఈ పోస్టుపై కామెంట్ల వర్షం కురుస్తోంది. దశాబ్దాల పాటు నిలిచిపోయే నిజమైన బంధాలు ఏళ్ల తరబడి చూపే ఓపిక, క్షమాగుణం, ఒకరికొకరు తోడుగా నిలవడం , ప్రతిరోజూ ఒకే వ్యక్తిని అంతే ఆప్యాయంగా ప్రేమించడం వల్లనే సాధ్యమవుతాయని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరైతే ఈ వీడియోను "రియల్ కపుల్ గోల్స్" అని అభివర్ణిస్తూ, నేటి తరం నేర్చుకోవాల్సిన ప్రేమ పాఠం ఇదేనని పేర్కొన్నారు. ఈ వృద్ధ జంటలాగే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రాణంగా ప్రేమించే, ఆప్యాయంగా చూసుకునే సరైన తోడును పొందాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.




