Viral Video: షాకింగ్ వీడియో.. చెత్తకుప్పలో డబ్బాల కొద్దీ చాక్లెట్లు.. మూటగట్టుకెళ్లిన జనం!

Viral Video: చెత్తకుప్పలో పారబోసిన డబ్బాల కొద్దీ చాక్లెట్ల కోసం జనం ఎగబడిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Arun Chilukuri
Published on: 25 Aug 2026 4:22 PM IST
Viral Video
X

Viral Video: షాకింగ్ వీడియో.. చెత్తకుప్పలో డబ్బాల కొద్దీ చాక్లెట్లు.. మూటగట్టుకెళ్లిన జనం!

Viral Video: చాక్లెట్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. కానీ చెత్తకుప్పలో పారేసిన చాక్లెట్ల కోసం జనం ఎగబడటం, పోటీపడి మరీ ఇళ్లకు తీసుకెళ్లడం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు అవి అక్కడ ఎందుకు ఉన్నాయి? తినడానికి పనికొస్తాయా లేదా అని కూడా ఆలోచించకుండా చేతికందినకాడికి మూటగట్టుకుని పోయారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పంకి జాతీయ రహదారి సమీపంలోని ఒక చెత్తకుప్ప వద్ద ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అక్కడ కుప్పలుగా పడి ఉన్న చాక్లెట్ డబ్బాలను చూసిన స్థానికులు, రోడ్డుపై ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వాహనదారులు వెంటనే వాహనాలను పక్కన నిలిపి వాటిని ఏరుకోవడానికి పోటీ పడ్డారు. కొందరైతే సంచుల్లో, మరికొందరు బైకులపై డబ్బాలకు డబ్బాలు వేసుకుని మరీ తీసుకెళ్లారు.

అయితే, ఆ చాక్లెట్ల ఎక్స్‌పైరీ డేట్ (గడువు) దాటిపోవడంతోనే తయారీదారులు లేదా వ్యాపారులు వాటిని పంకి నేషనల్ హైవే సమీపంలో పారబోసినట్లు తెలుస్తోంది. ప్యాకింగ్ కవర్ల ప్రకారం కొన్నింటి గడువు 2024లోనే ముగిసినట్లు సమాచారం. గడువు తీరిన పదార్థాలు తింటే ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందనే కనీస స్పృహ లేకుండా జనం ఎగబడటంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక యంత్రాంగం దర్యాప్తునకు ఆదేశించింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story