Video Viral : దివ్యాంగుడిగా యాక్టింగ్.. అడ్డంగా బుక్కైన బెగ్గర్.!

Video Viral : ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో ఒక విచిత్రమైన, దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. వికలాంగుడిగా నటిస్తూ, దారిపోయే వారి నుంచి డబ్బులు..

G Krishna
Published on: 30 July 2026 1:30 PM IST
fake-disabled-beggar-viral-
X

fake-disabled-beggar-viral-

Video Viral : ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో ఒక విచిత్రమైన, దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. వికలాంగుడిగా నటిస్తూ, దారిపోయే వారి నుంచి డబ్బులు అడుక్కుంటున్న ఒక వ్యక్తిని స్థానికులు పక్కా ప్లాన్‌తో పట్టుకున్నారు. ఆయన అసలు రంగును బయటపెడుతూ రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

నెమ్మదిగా కదులుతూ.. పాపం అనిపించేలా సీన్ క్రియేషన్

వైరల్ అవుతున్న ఆ వీడియోను పరిశీలిస్తే, బిజీగా ఉన్న బెంగళూరు వీధిలో సదరు వ్యక్తి చాలా కష్టపడుతూ నడుస్తున్నట్లు కనిపిస్తాడు. ఒక చేతికర్రను గట్టిగా పట్టుకుని, ఒక కాలును నేలపై ఈడ్చుకుంటూ అడుగు తీసి అడుగు వేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు నటిస్తాడు. అతడి దయనీయ స్థితిని చూసిన ఏ పాదచారికైనా వెంటనే జాలి కలిగి, జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చేలా ఆ డ్రామా సాగింది.

సీన్ కట్ చేస్తే.. రీల్ టర్న్డ్ రియాలిటీ

అయితే, ప్రతిరోజూ అతడి కదలికలను గమనిస్తున్న కొందరు స్థానిక పౌరులకు అతడి ప్రవర్తనపై తీవ్ర అనుమానం వచ్చింది. కొన్ని నిమిషాల క్రితమే అతడు ఎలాంటి కర్ర సహాయం లేకుండా, చాలా సాధారణంగా నడవడం తాము చూశామని గ్రహించిన స్థానికులు ఒక్కసారిగా అతడిని చుట్టుముట్టారు. "ఇందాకే సరిగ్గా నడిచావు కదా, ఇప్పుడు ఈ నాటకాలేంటి?" అని గట్టిగా నిలదీశారు. స్థానికులు గద్దించడంతో ఆ వ్యక్తికి ఏం చేయాలో పాలుపోలేదు. అంతవరకు తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్నట్లు నటించిన అతడు, ఒక్కసారిగా తన చేతికర్రను పక్కనపెట్టి ఎలాంటి లంగడం లేకుండా సాధారణ మనిషిలా నడవడం మొదలుపెట్టాడు. ఈ ఊహించని మార్పును చూసి అక్కడున్న వారంతా ముక్కున వేలేసుకున్నారు.

కెమెరాల్లో రికార్డ్.. నెట్టింట వైరల్ వీడియో

ఈ డ్రామా మొత్తాన్ని అక్కడే ఉన్న పలువురు ప్రత్యక్ష సాక్షులు తమ స్మార్ట్‌ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలోకి రాగానే కాసేపట్లోనే విపరీతంగా షేర్ అయ్యాయి. ప్రజల సానుభూతిని, దయాగుణాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి కేటుగాళ్లు మోసాలకు పాల్పడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, కేవలం వైరల్ వీడియో ఆధారంగా ముగింపునకు రాకూడదని కొందరు వ్యాఖ్యానిస్తుండగా.. ఇలాంటి నకిలీ బెగ్గర్స్ చేసే మోసాల వల్ల సమాజంలో నిజంగా వైకల్యంతో బాధపడుతూ, ఇతరుల సాయంపై ఆధారపడే అసలైన దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో నమ్మకం పోయి, నిజమైన బాధితులకు కూడా సాయం అందకుండా పోయే ప్రమాదం ఉందనే చర్చ మళ్లీ మొదలైంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story