Father’s Day 2026: ఈ ఏడాది ఫాదర్స్ డే ఎప్పుడు? దీని చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి? బెస్ట్ విషెస్
Father’s Day 2026: తండ్రి కుటుంబానికి వెన్నెముక లాంటి వ్యక్తి. పిల్లల ఎదుగుదలలో, కుటుంబ నిర్మాణంలో, జీవిత విలువలు నేర్పడంలో తండ్రి పాత్ర ఎంతో కీలకం.
Father’s Day 2026: ఈ ఏడాది ఫాదర్స్ డే ఎప్పుడు? దీని చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి? బెస్ట్ విషెస్
Father’s Day 2026: తండ్రి కుటుంబానికి వెన్నెముక లాంటి వ్యక్తి. పిల్లల ఎదుగుదలలో, కుటుంబ నిర్మాణంలో, జీవిత విలువలు నేర్పడంలో తండ్రి పాత్ర ఎంతో కీలకం. తండ్రుల ప్రేమ, త్యాగం, మార్గదర్శకత్వాన్ని గుర్తు చేసుకునేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటారు. 2026లో ఫాదర్స్ డే ఎప్పుడు వస్తుంది? దీని చరిత్ర, ప్రాముఖ్యత ఏమిటి? తెలుసుకుందాం.
ఫాదర్స్ డే 2026 ఎప్పుడు?
భారత్, అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి అనేక దేశాల్లో ప్రతి సంవత్సరం జూన్ నెల మూడో ఆదివారం ఫాదర్స్ డే జరుపుతారు. 2026లో ఫాదర్స్ డే జూన్ 21, ఆదివారం రోజున వస్తుంది.
ఈ రోజు కుటుంబ సభ్యులు తమ తండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారితో సమయం గడుపుతూ ప్రేమాభిమానాలను వ్యక్తం చేస్తారు.
ఫాదర్స్ డే చరిత్ర ఏమిటి?
ఫాదర్స్ డే ఆరంభం 20వ శతాబ్దం ప్రారంభంలో అమెరికాలో జరిగింది. ఈ వేడుకను ప్రారంభించడంలో Sonora Smart Dodd కీలక పాత్ర పోషించారు.
మదర్స్ డే జరుపుతున్నట్లే తండ్రులకు కూడా ప్రత్యేక రోజు ఉండాలని ఆమె భావించారు. ఆమె తల్లి మరణించిన తర్వాత, తండ్రి.. ఒంటరిగా ఆరుగురు పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఆయన త్యాగాన్ని గౌరవించేందుకు తండ్రుల కోసం ప్రత్యేక దినోత్సవం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 1910లో అమెరికాలోని Spokane నగరంలో మొదటిసారిగా ఫాదర్స్ డే నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది.
అధికారిక గుర్తింపు ఎలా వచ్చింది?
ఫాదర్స్ డే క్రమంగా ప్రజాదరణ పొందింది. చివరకు 1972లో అమెరికా అధ్యక్షుడు రిచార్డ్ నిక్సస్ అధికారిక ప్రకటనపై సంతకం చేసి జూన్ మూడో ఆదివారాన్ని జాతీయ ఫాదర్స్ డేగా గుర్తించారు.
ఆ తర్వాత ఈ వేడుక ప్రపంచంలోని అనేక దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం వివిధ సంస్కృతులు, సంప్రదాయాలకు అనుగుణంగా ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు.
ఫాదర్స్ డే ప్రాముఖ్యత ఏమిటి?
ఫాదర్స్ డే కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. కుటుంబం కోసం తండ్రులు చేసే కష్టాలు, త్యాగాలు, బాధ్యతలను గుర్తు చేసుకునే రోజు కూడా. ఈ రోజు ద్వారా
తండ్రుల ప్రేమ, అంకితభావాన్ని గౌరవించవచ్చు.
కుటుంబ బంధాలను మరింత బలపరచవచ్చు.
తండ్రుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయవచ్చు.
పిల్లలు, తండ్రుల మధ్య అనుబంధాన్ని మరింత పెంచుకోవచ్చు. కుటుంబ విలువల ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవచ్చు.
ఫాదర్స్ డే శుభాకాంక్షలు, సందేశాలు:
* నా జీవితంలో ఎప్పుడూ నాకు అండగా నిలిచిన నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
* మీ ప్రేమ, మార్గదర్శకత్వం వల్లనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే.
* కుటుంబం కోసం మీరు చేసిన ప్రతి త్యాగానికి ధన్యవాదాలు నాన్న.
* మీరు నాకు తండ్రి మాత్రమే కాదు, స్నేహితుడు, గురువు కూడా. ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
* మీ ప్రేమే మా కుటుంబానికి బలమైన పునాది. హ్యాపీ ఫాదర్స్ డే.
* జీవితంలో బాధ్యత అంటే ఏమిటో నేర్పింది మీరే. ధన్యవాదాలు నాన్న.
* మీరు చూపిన దారే నా విజయానికి కారణం. ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
* మీలాంటి తండ్రి ఉండటం నా అదృష్టం. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి.
* జీవితంలో కష్టం వచ్చిన ప్రతీసారి గుర్తొచ్చే ఏకైక వ్యక్తి నాన్న మాత్రమే.




