Hidden Kitten: మీ ఐక్యూకి పదును పెట్టే పజిల్.. ఈ చెట్టులో దాక్కున్న పిల్లిని 10 సెకన్లలో కనిపెట్టగలరా?

Hidden Kitten: పజిల్స్, సుడోకు, ఆప్టికల్ ఇల్యూషన్స్ వంటి మెదడుకు పని చెప్పే ఆటలను ఇష్టపడేవారికి ఇది సవాల్. ఈ చెట్టులో దాక్కున్న పిల్లిని 10 సెకన్లలో కనిపెట్టగలరా?.

Rishvik
Published on: 25 Aug 2026 7:43 PM IST
Hidden Kitten
X

Hidden Kitten: మీ ఐక్యూకి పదును పెట్టే పజిల్.. ఈ చెట్టులో దాక్కున్న పిల్లిని 10 సెకన్లలో కనిపెట్టగలరా?

Hidden Kitten: పజిల్స్, సుడోకు, ఆప్టికల్ ఇల్యూషన్స్ వంటి మెదడుకు పని చెప్పే ఆటలను ఇష్టపడేవారికి ఇది ఆసక్తికరమైన సవాల్. ఇలాంటి పజిల్స్ మన పరిశీలనా శక్తి, ఏకాగ్రత, విజువల్ పర్సెప్షన్‌ను పరీక్షిస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ మీ కళ్లకు, మెదడుకు అసలైన పరీక్ష పెట్టనుంది.

10 సెకన్ల ఛాలెంజ్.. పిల్లి ఎక్కడుంది?:

ఈ పజిల్ చిత్రంలో చెట్టు మొదలు, కాండం, దాని చుట్టూ విస్తరించిన వేర్లు మాత్రమే కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. మొదటి చూపులో ఇది ఒక సాధారణ చెట్టు ఫొటోలాగే కనిపిస్తుంది. అయితే ఈ వేర్ల మధ్యలో ఓ చిన్న పిల్లి పిల్ల దాక్కుంది. దాని శరీరం రంగు, ఆకారం చెట్టు వేర్లతో కలిసిపోవడంతో వెంటనే గుర్తించడం అంత సులభం కాదు. మీ ఛాలెంజ్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని నిశితంగా పరిశీలించి, కేవలం 10 సెకన్లలో దాక్కున్న పిల్లిని గుర్తించాలి. తొందరపడి మొత్తం చిత్రాన్ని ఒకేసారి చూడకుండా.. చెట్టు వేర్లు, ముఖ్యంగా మూలలు అండ్ ఖాళీ ప్రదేశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే సమాధానం త్వరగా దొరికే అవకాశం ఉంటుంది.

ఆప్టికల్ ఇల్యూషన్స్ ఎందుకు ఆసక్తికరం?:

ఇలాంటి పజిల్స్ కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా మన దృష్టిని ఒక విషయంపై కేంద్రీకరించేందుకు సహాయపడతాయి. ఒకే చిత్రంలో చిన్న తేడాను గుర్తించాల్సి రావడంతో.. పరిశీలనా శక్తి, ఏకాగ్రత, విజువల్ ప్రాసెసింగ్ వంటి నైపుణ్యాలను ఉపయోగించాల్సి ఉంటుంది. సమస్యను సాధారణంగా కాకుండా భిన్నమైన కోణంలో చూడాలనే ఆలోచనను కూడా ఇవి ప్రోత్సహిస్తాయి.

కనిపెట్టలేకపోయారా?.. ఇదిగో చిన్న హింట్:

10 సెకన్లలో పిల్లిని గుర్తించలేకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చిత్రంలోని కుడివైపు పై మూలలో ఉన్న చెట్టు వేర్లను మరోసారి నిశితంగా పరిశీలించండి. అక్కడే దాక్కున్న పిల్లి కనిపిస్తుంది. చెట్టు వేర్ల రంగుతో దాని శరీరం కలిసిపోయినట్టుగా ఉండటమే ఈ పజిల్‌లో పిల్లిని కనిపెట్టడం కష్టంగా ఉంటుంది.

మీ సమాధానం సరైందా?:

మీరు 10 సెకన్లలోనే పిల్లిని గుర్తించగలిగితే.. మీ పరిశీలనా శక్తి నిజంగా అదిరిపోయినట్టే. ఒకవేళ ఎక్కువ సమయం పట్టినా పర్లేదు.. మరోసారి చిత్రాన్ని చూసి పిల్లి ఎక్కడ ఉందో గుర్తించడానికి ప్రయత్నించండి. ఈ పజిల్‌ను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసి.. వారిలో ఎవరు పిల్లిని వేగంగా కనిపెట్టగలరో కూడా పరీక్షించండి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story