Viral News : విమానం ల్యాండ్ చేయలేదని రచ్చ.. మహిళకు నెటిజన్ల షాక్

Viral News : ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ల్యాండింగ్ ఆలస్యమవ్వడంతో ఓ మహిళ క్యాబిన్ సిబ్బందితో తీవ్ర ఘర్షణకు దిగింది. ఇతర విమానాలు ల్యాండ్

G Krishna
Published on: 13 Sept 2026 4:03 PM IST
Viral-News
X

Viral-News

Viral News : ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ల్యాండింగ్ ఆలస్యమవ్వడంతో ఓ మహిళ క్యాబిన్ సిబ్బందితో తీవ్ర ఘర్షణకు దిగింది. ఇతర విమానాలు ల్యాండ్ అవుతుంటే తమ విమానం మాత్రమే ఎందుకు ఆగాలంటూ ఆమె సిబ్బందిపై కేకలు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్యాబిన్ సిబ్బందిపై అసహనం

ఇన్‌స్టాగ్రామ్‌లో @annieirl అనే ఖాతాదారు ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల ల్యాండింగ్ ఆలస్యమైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ సిబ్బందిని ప్రశ్నిస్తూ, "నాకు సమాధానం చెప్పండి.. మిగతా విమానాలన్నీ ల్యాండ్ అవుతున్నప్పుడు ఈ ఒక్క విమానమే ఎందుకు ల్యాండ్ కావడం లేదు? కారణం ఏంటో చెప్పండి" అని నిలదీసింది. సిబ్బంది తమకు సరైన కారణం తెలియదని చెప్పగా, ఆమె మరింత గట్టిగా అరుస్తూ "పైలట్‌ను అడిగి నాకు చెప్పండి, నాకు కారణం తెలిసితీరాలి" అని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, గత అర గంటలో 15 నుండి 20 విమానాలు ల్యాండ్ అయ్యాయని హిందీలో వాదిస్తూ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది.

'వెకేషన్ కోసం ప్రాణాలైనా ఇస్తుందా?'.. సెటైర్లు

ఈ వీడియోను షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సదరు మహిళ ప్రవర్తనపై వ్యంగ్యంగా స్పందించారు. "వాతావరణం ఖరాబైతే ఏంటి? ల్యాండ్ చేసేయండి.. పోతే ప్రాణాలు పోతాయి, అంతేగా? ఈ చిన్నదాని వెకేషన్ కోసం విమానయాన నిబంధనలు, ఫిజిక్స్, కనీస జ్ఞానాన్ని కూడా పక్కన పెట్టేలా ఉంది" అని క్యాప్షన్ రాసుకొచ్చారు.

సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు

ఈ వీడియో 'X' ప్లాట్‌ఫామ్‌కి చేరడంతో నెటిజన్లు ఆ మహిళ ప్రవర్తనపై విరుచుకుపడ్డారు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా అంత అహంకారంతో, మర్యాద లేకుండా సిబ్బందితో ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు. బాలీవుడ్ నటి డయానా పెంటీ కూడా ఈ వీడియోపై స్పందిస్తూ కామెంట్ చేశారు. అవియేషన్ నిపుణులు, పైలట్లు మాత్రం ఈ అంశంపై సాంకేతిక వివరణ ఇచ్చారు. గాలి వేగం, విజిబిలిటీ (కంటిచూపు మేర), , రన్‌వే పరిస్థితుల ఆధారంగా ప్రతి విమానానికి భద్రతా ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు. వేరే విమానాలు ల్యాండ్ అయినంత మాత్రాన, అన్ని విమానాలకు ఆ సమయం సురక్షితం కాదని స్పష్టం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.