Viral News: చేయని తప్పుకు నింద వేసి తీసేశారు.. ఏకంగా రూ. 1.9 కోట్లు సంపాదన.. కానీ!

Viral News: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కంపెనీలో ఏకంగా కోట్లలో జీతం తీసుకునే ఓ ఉన్నత స్థాయి ఉద్యోగిని కేవలం ఒక చిన్న చాక్లెట్ కుకీ దొంగిలించాడనే అకారణంగా ఉద్యోగం నుంచి తీసేశారు.

Ravi
By Ravi
Published on: 3 July 2026 7:45 PM IST
Viral News
X

Viral News: చేయని తప్పుకు నింద వేసి తీసేశారు.. ఏకంగా రూ. 1.9 కోట్లు సంపాదన.. కానీ!

Viral News: కార్పొరేట్ ప్రపంచంలో కొన్నిసార్లు జరిగే పరిణామాలు వింటే మనం తీవ్ర ఆశ్చర్యానికి గురికాక తప్పదు. అమెరికాలోని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ 'ఫోర్డ్' కంపెనీలో ఇటీవల జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా కోట్లలో ప్యాకేజీ తీసుకునే ఒక ఉన్నత స్థాయి ఉద్యోగిని కేవలం వందల రూపాయల విలువ చేసే ఒక చిన్న వస్తువును దొంగిలించాడనే నెపంతో కంపెనీ యాజమాన్యం అకారణంగా విధుల నుంచి తొలగించింది.

వివరాల ప్రకారం.. అమెరికాలోని ఫోర్డ్ కంపెనీలో కర్ట్ క్రోమ్ అనే వ్యక్తి అత్యున్నత హోదాలో ఎంతో కాలంగా పని చేస్తూ ఏటా సుమారు రూ. 1.9 కోట్ల భారీ వేతనం తీసుకుంటున్నాడు. అయితే, ఆయన ఒకరోజు కంపెనీ క్యాంటీన్‌లో కేవలం రూ. 186 విలువైన ఒక చిన్న చాక్లెట్ కుకీ దొంగిలించాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన కంపెనీ యాజమాన్యం ఆయన వాదనను కనీసం వినిపించుకోకుండా ఏకంగా ఉద్యోగం నుంచి దారుణంగా తొలగించింది.

తాను చేయని తప్పుకు నిందలు పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన కర్ట్ క్రోమ్, ఎలాగైనా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని భావించాడు. తాను ఆ కుకీని దొంగిలించలేదని, తన డెబిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసినట్లుగా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను బయటపెట్టి తన నిజాయితీని సగర్వంగా నిరూపించుకున్నాడు.

బ్యాంక్ స్టేట్‌మెంట్ చూసి అవాక్కయిన కంపెనీ యాజమాన్యం తమ తప్పు తెలుసుకుని వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పి తిరిగి ఉద్యోగంలో చేరాలని కోరింది.

కానీ, అకారణంగా తనను దొంగగా ముద్రవేసి ఘోరంగా అవమానించిన చోట తాను ఇకపై ఒక్క క్షణం కూడా పని చేయలేనని, తన ఆత్మగౌరవమే తనకు ముఖ్యమని చెబుతూ ఆ ఆఫర్‌ను ఆయన నిర్మొహమాటంగా తిరస్కరించారు. ప్రస్తుతం ఆయన మరోచోట అంతకంటే మెరుగైన ఉద్యోగంలో చేరి ఈ చేదు అనుభవాన్ని అందరితో పంచుకున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story