Facts: ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.? ఫ్రాన్స్‌లో మాత్రం పుట్టలేదు
Facts: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఫాస్ట్ ఫుడ్‌లలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి. అయితే "ఫ్రెంచ్" అనే పేరు ఉండటంతో ఈ వంటకం ఫ్రాన్స్‌లో పుట్టిందని భావిస్తారు.
Facts: ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.? ఫ్రాన్స్‌లో మాత్రం పుట్టలేదు
Facts: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఫాస్ట్ ఫుడ్‌లలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి. అయితే "ఫ్రెంచ్" అనే పేరు ఉండటంతో చాలామంది ఈ వంటకం ఫ్రాన్స్‌లో పుట్టిందని భావిస్తారు. కానీ చరిత్ర చెబుతున్న కథ మాత్రం వేరేలా ఉంది.
బెల్జియంలో మొదలైన ఫ్రెంచ్ ఫ్రైస్ కథ
చరిత్రకారుల సమాచారం ప్రకారం, ఫ్రెంచ్ ఫ్రైస్ మూలాలు 17వ శతాబ్దం చివర్లో బెల్జియంలో ఉన్నాయి. 1680 ప్రాంతంలో తీవ్రమైన చలికాలం కారణంగా బెల్జియంలోని నామూర్ ప్రాంతం గుండా ప్రవహించే మ్యూస్ నది పూర్తిగా గడ్డకట్టిపోయింది. ఆ నది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ ఆహారం కోసం ప్రధానంగా చేపల వేటపైనే ఆధారపడేవారు. నదిలో దొరికే చిన్న చేపలను నూనెలో వేయించి తినడం వారి సాధారణ అలవాటు. కానీ నది గడ్డకట్టిపోవడంతో చేపలు పట్టడం అసాధ్యమైపోయింది. దీంతో ఆహార కొరత ఏర్పడింది.
చేపలకు బదులుగా ఆలుగడ్డలు
ఆహార సమస్యను ఎదుర్కొనేందుకు గ్రామస్థులు కొత్త మార్గాన్ని వెతికారు. చేపల ఆకారంలో ఉండేలా ఆలుగడ్డలను పొడవుగా, సన్నగా ముక్కలు చేసి నూనెలో వేయించడం ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతమైంది. వేయించిన ఆలుగడ్డ ముక్కలు రుచిగా ఉండటంతో స్థానిక ప్రజలు వాటిని ఇష్టపడటం ప్రారంభించారు. కొద్దికాలంలోనే అవి బెల్జియం ప్రజల ఆహారంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఇదే నేటి ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆరంభంగా భావిస్తున్నారు.
"ఫ్రెంచ్ ఫ్రైస్" అనే పేరు ఎలా వచ్చింది?
ఫ్రెంచ్ ఫ్రైస్ అనే పేరు మాత్రం తర్వాత వచ్చింది. దీనికి మొదటి ప్రపంచ యుద్ధంతో సంబంధం ఉంది. యుద్ధ సమయంలో అమెరికా సైనికులు బెల్జియంలో విధులు నిర్వహించారు. అక్కడి ప్రజలు వారికి ఈ ఆలుగడ్డ వంటకాన్ని పరిచయం చేశారు. ఆ సమయంలో బెల్జియంలోని అనేక ప్రాంతాల్లో ఫ్రెంచ్ భాష విస్తృతంగా మాట్లాడేవారు. స్థానికులు ఫ్రెంచ్‌లో మాట్లాడటం చూసిన అమెరికన్ సైనికులు పొరపాటున ఇది ఫ్రాన్స్‌కు చెందిన వంటకమని భావించారు. దీంతో ఈ తలించిన ఆలుగడ్డ ముక్కలకు "ఫ్రెంచ్ ఫ్రైస్" అనే పేరు పెట్టారు. ఆ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
ఫ్రెంచ్ ఫ్రైస్‌పై బెల్జియం గర్వం
నేటికీ బెల్జియం ఫ్రెంచ్ ఫ్రైస్ అసలు పుట్టినిల్లు తమ దేశమేనని గర్వంగా చెబుతుంది. అక్కడ ఫ్రైస్‌కు ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది. బెల్జియన్ స్టైల్ ఫ్రైస్ సాధారణంగా కొంచెం మందంగా ఉంటాయి. వాటిని మరింత కరకరలాడేలా రెండు సార్లు నూనెలో వేయిస్తారు. అలాగే ఇతర దేశాల్లోలాగా కేవలం టమాటో కెచప్‌తో కాకుండా, వివిధ రకాల సాస్‌లతో వడ్డిస్తారు. అందుకే బెల్జియన్ ఫ్రైస్ రుచి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.




