Fruit Math Puzzle: ఆసక్తికరంగా ఫ్రూట్ మ్యాథ్స్ పజిల్.. కోకోనట్, యాపిల్, బననాతో సరైన ఆన్సర్ చెప్పగలరా?.. ఓసారి ట్రై చేయండి!
Can you solve the viral fruit math puzzle. యాపిల్, అరటిపండ్లు, కొబ్బరికాయతో రూపొందించిన ఈ పజిల్‌లో చివరి సమీకరణకు సరైన సమాధానం కనుగొనడం చాలా మందికి పెను సవాలుగా మారింది.
Fruit Math Puzzle: ఆసక్తికరంగా ఫ్రూట్ మ్యాథ్స్ పజిల్.. కోకోనట్, యాపిల్, బననాతో సరైన ఆన్సర్ చెప్పగలరా?.. ఓసారి ట్రై చేయండి!
Fruit Math Puzzle: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో 'మ్యాథ్స్ పజిల్స్' వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఎంతో సులభంగా కనిపించినా.. సమాధానం చెప్పే సమయంలో చాలామంది పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి ఓ ఆసక్తికరమైన ఫ్రూట్ మ్యాథ్స్ పజిల్ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. యాపిల్, అరటిపండ్లు, కొబ్బరికాయతో రూపొందించిన ఈ పజిల్‌లో చివరి సమీకరణకు సరైన సమాధానం కనుగొనడం చాలా మందికి పెను సవాలుగా మారింది.
ఈ పజిల్‌లో మొదట మూడు యాపిల్స్ మొత్తం విలువ 30గా ఇచ్చారు. దీంతో ఒక్కో యాపిల్ విలువ 10 అని తేలుతుంది. తర్వాత ఒక యాపిల్‌తో పాటు రెండు అరటిపండ్ల గుత్తి మొత్తం విలువ 18గా ఉండటంతో.. ఒక్కో అరటిపండ్ల గుత్తి విలువ 4గా నిర్ధారించవచ్చు. మూడో సమీకరణలో ఒక అరటిపండ్ల గుత్తి, రెండు హాఫ్ కొబ్బరికాయల మొత్తం విలువ 14గా ఉండటంతో.. ఒక్కో కొబ్బరికాయ భాగం విలువ 5గా వస్తుంది.
ఇప్పుడు చివరి ప్రశ్నలో ఒక కొబ్బరికాయ భాగం + ఒక యాపిల్ × ఒక అరటిపండ్ల గుత్తి విలువ ఎంత? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇక్కడే అందరూ పప్పులో కలేస్తున్నారు. కొబ్బరికాయ భాగం + ఒక యాపిల్ కలిపితే.. 15 అవుతుంది. ఈ 15ను అరటిపండ్ల గుత్తి 4తో గుణిస్తే.. 60 సమాధానం వస్తుంది. అయితే అది తప్పు ఆన్సర్. గణిత నియమాల ప్రకారం.. ముందుగా గుణకారాన్ని పూర్తి చేయాలి. కాబట్టి యాపిల్ విలువ 10ను అరటిపండ్ల గుత్తి విలువ 4తో గుణిస్తే 40 వస్తుంది. ఆ తర్వాత కొబ్బరికాయ భాగం విలువ 5ను కలిపితే మొత్తం 45 వస్తుంది.
అయితే ఇలాంటి పజిల్స్‌లో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు చివరి లైన్‌లో పండ్ల సంఖ్య లేదా చిత్రంలో ఉన్న వస్తువుల ఆకారాన్ని మార్చి విలువను కూడా మారుస్తారు. అలాంటి మార్పులు ఉంటే సమాధానం భిన్నంగా ఉంటుంది. కానీ ఈ పజిల్‌లో చివరి వరుసలో కనిపిస్తున్న చిత్రాలు ముందున్న సమీకరణల్లో ఉన్న వాటితో ఒకే విధంగా ఉన్నందున.. సరైన సమాధానం 45 అవుతుంది. ఇలాంటి మ్యాథ్స్ పజిల్స్ కేవలం వినోదానికే కాకుండా పరిశీలనా శక్తి, ఆలోచన, గణిత నైపుణ్యాలను కూడా మెరుగుపరచడంలో సహాయపడతాయి. అందుకే సోషల్ మీడియాలో ఇవి తరచూ వైరల్ అవుతూ నెటిజన్లను ఆలోచింపజేస్తుంటాయి.




