How to Kill Men: ఆడోళ్లు మరి ఇంత వైల్డ్‌గా తయ్యారేంటి బాసూ!

How to Kill Men:మెట్రో రైలులో ఓ యువతి ‘How to Kill Men and Get Away With It’ అనే సంచలనాత్మక టైటిల్ ఉన్న పుస్తకాన్ని చదువుతూ కనిపించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Naresh.k
Published on: 2 July 2026 12:20 PM IST
How to Kill Men
X

How to Kill Men: ఆడోళ్లు మరి ఇంత వైల్డ్‌గా తయ్యారేంటి బాసూ!

How to kill men book viral : సాధారణంగా బస్సులు, రైళ్లు, మెట్రోల్లో ప్రయాణించేటప్పుడు టైంపాస్ కోసం చాలామంది ఫోన్లు చూస్తుంటారు. కొందరు మాత్రం ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటూ కనిపిస్తారు. అయితే, తాజాగా మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ యువతి చదువుతున్న పుస్తకం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పక్క సీట్లలో ఉన్న ప్రయాణికులకు సైతం చెమటలు పట్టేలా చేసింది ఆ పుస్తకం.

అంతలా ఆ పుస్తకంలో ఏముందబ్బా అనుకుంటున్నారా? ఎంతో ప్రశాంతంగా, శ్రద్ధగా కూర్చుని ఆ యువతి చదువుతున్న పుస్తకం టైటిల్.. ‘How to Kill Men and Get Away With It’. అవును, మీరు విన్నది నిజమే. ఈ విచిత్రమైన, సంచలనాత్మక టైటిల్‌తో ఉన్న పుస్తకాన్ని ఆమె చదువుతుండగా తీసిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికల్లో మిలియన్ల వ్యూస్, లక్షలాది లైకులతో తెగ వైరల్ అవుతోంది.

మెట్రో రైలులో ఆ యువతి చాలా కూల్‌గా, దర్జాగా కూర్చుని ఆ నవలలోని పేజీలను తిరగేస్తోంది. అయితే, ఆ పుస్తకం కవర్‌పై పెద్ద అక్షరాలతో ఉన్న మగాళ్లను చంపి తప్పించుకోవడం ఎలా? అనే లైన్ చూడగానే తోటి ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ రోజుల్లో భర్తలను, ప్రియులను హత్య చేస్తున్న వార్తలు తరచుగా వింటున్న తరుణంలో.. మెట్రోలో లైవ్‌గా ఒక అమ్మాయి ఇలాంటి పుస్తకం చదవడం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు ఈ వీడియో కింద పెడుతున్న కామెంట్లు నవ్వులు పూయిస్తున్నాయి. ఆమె పక్కన కూర్చున్న అబ్బాయిలు వెంటనే సీట్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం మంచిది అని ఒకరు కామెంట్ చేయగా.. పాపం.. ఆమె బాయ్‌ఫ్రెండ్ పరిస్థితి ఏంటో? అతనికి డేంజర్ బెల్స్ మోగినట్లే అని మరొకరు సరదాగా రాసుకొచ్చారు. నేను గనుక అక్కడ ఉంటే.. నెక్స్ట్ స్టాప్‌లోనే మెట్రో దిగి పారిపోయేవాడిని అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

అయితే ఈ టైటిల్ చూసి భయపడాల్సిన అవసరం లేదని, ఇదొక ప్రముఖ డార్క్ కామెడీ థ్రిల్లర్ నవల అని పుస్తక ప్రియులు చెబుతున్నారు. ప్రసిద్ధ రచయిత్రి మైకేల్ కావన్ రాసిన ఈ ఫిక్షన్ నవల ఇంటర్నేషనల్ వైడ్‌గా బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. సమాజంలో మహిళలపై జరిగే అన్యాయాలపై ఒక మహిళ ఎలాంటి ప్రతీకారం తీర్చుకుందనే కథాంశంతో సాగే నవల ఇది.

టైటిల్ భయంకరంగా ఉన్నప్పటికీ.. అది కేవలం ఒక కథ మాత్రమే. కానీ, మెట్రో లాంటి పబ్లిక్ ప్లేస్‌లో ఆ అమ్మాయి ఏమాత్రం సంకోచించకుండా అంత పెద్ద టైటిల్ ఉన్న పుస్తకాన్ని చదవడం, దాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ‘రైడింగ్’ కాస్తా ట్రెండింగ్‌గా మారిపోయింది.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story