బామ్మ 18 ఏళ్ల కల.. పెళ్లి రోజున నిజం చేసిన మనవడు

పెళ్లంటేనే సందడి.. బంధువుల హడావుడి.. బాజాభజంత్రీలు.. ఊరేగింపులు! కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వరుడు మాత్రం తన పెళ్లికి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు..

G Krishna
Published on: 13 Nov 2026 1:36 PM IST
Helicopter Wedding Entry
X

 Helicopter Wedding Entry

పెళ్లంటేనే సందడి.. బంధువుల హడావుడి.. బాజాభజంత్రీలు.. ఊరేగింపులు! కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వరుడు మాత్రం తన పెళ్లికి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఏకంగాహెలికాప్టర్‌లో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే దీని వెనుక కేవలం హంగామా, ఆర్భాటం మాత్రమే కాదు.. తన బామ్మకు ఇచ్చిన మాట, ఆమె 18 ఏళ్ల కల కూడా ఉన్నాయి.

హెలికాప్టర్‌లో పెళ్లి ఊరేగింపు

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన హీరా రాణా తన పెళ్లి కోసం హెలికాప్టర్‌ను ఎంచుకున్నాడు. హాపూర్ జిల్లాలోని దేహ్రా గ్రామానికి తన పెళ్లి బరాత్‌తో కలిసి హెలికాప్టర్‌లో చేరుకున్నాడు. ఆకాశం నుంచి హెలికాప్టర్ రావడంతో గ్రామస్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చాపర్ ల్యాండ్ అవ్వగానే పెళ్లి వేడుక ఒక్కసారిగా ప్రత్యేక ఆకర్షణగా మారిపోయింది.

బామ్మ 18 ఏళ్ల కల కోసం

అయితే హీరా రాణా ఇలా హెలికాప్టర్‌లో రావడం వెనుక ఓ అందమైన ఎమోషన్ ఉంది. తన మనవడు పెళ్లి రోజున హెలికాప్టర్‌లో రావాలని అతడి బామ్మ దాదాపు 18 ఏళ్లుగా కలలు కంటోంది. ఆ కోరికను ఎలాగైనా నెరవేర్చాలని హీరా నిర్ణయించుకున్నాడు. తన పెళ్లి రోజున బామ్మ కలను నిజం చేసి ఆమెకు మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చాడు.

పెళ్లి తర్వాత కూడా హెలికాప్టర్‌లోనే

ఇక పెళ్లి వేడుక పూర్తయిన తర్వాత కూడా హీరా రాణా తన భార్యతో కలిసి అదే హెలికాప్టర్‌లో బయలుదేరాడు. దీంతో గ్రామంలో ఈ పెళ్లి గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు గుర్రంపై రావడం, కార్లలో ఊరేగింపుగా రావడం చూస్తుంటాం. కానీ బామ్మ కోసం హెలికాప్టర్‌లో వచ్చి ఆమె 18 ఏళ్ల కలను నిజం చేసిన హీరా రాణా మాత్రం అందరి మనసులు గెలుచుకున్నాడు. ఖరీదైన బహుమతుల కంటే మనసులోని కోరికను నెరవేర్చడం ఎంత గొప్పదో ఈ పెళ్లి మరోసారి నిరూపించింది. అందుకే ఈ హెలికాప్టర్ ఎంట్రీ కేవలం గ్రాండ్ ఎంట్రీగా కాకుండా.. బామ్మపై మనవడికి ఉన్న ప్రేమకు గుర్తుగా నిలిచిపోయింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.