Viral Wedding: వరుడి మెడలో వంద అడుగుల నోట్ల దండ.. నిచ్చెన ఎక్కి మరీ వేసిన వైనం!
Viral Wedding: రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఒక పెళ్లి ఊరేగింపులో వరుడికి ఏకంగా 100 అడుగుల కరెన్సీ నోట్ల దండను వేశారు.
Viral Wedding: వరుడి మెడలో వంద అడుగుల నోట్ల దండ.. నిచ్చెన ఎక్కి మరీ వేసిన వైనం!
Viral Wedding: పెళ్లిళ్లలో పూల దండలు, గజమాలలు వేయడం సాధారణం. కానీ రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా బమన్వాడీ గ్రామంలో జరిగిన ఒక పెళ్లి వేడుక మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ వరుడికి ఏకంగా 100 అడుగుల పొడవున్న కరెన్సీ నోట్ల దండను మెడలో వేశారు.
ఈ నెల 19న జరిగిన ఈ ఊరేగింపులో రూ. 500, రూ. 100 నోట్లతో తయారు చేసిన భారీ దండను ప్రదర్శించారు. ఆ దండ ఎంత పొడవు ఉందంటే.. దానిని వరుడి మెడలో వేయడానికి అతను ఏకంగా నిచ్చెన ఎక్కాల్సి వచ్చింది. అడుగు నుంచి పైవరకు నోట్లతో నిండిన ఈ భారీ మాలను చూసి స్థానికులు విస్తుపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ శరణ్ గోపీనాథ్ కాంబ్లే స్పందించారు. పెళ్లిళ్లలో ఇలా నోట్ల దండలు వేయడం తమ ఆచారమని గ్రామస్థులు చెబుతున్నారని ఆయన తెలిపారు. అయితే, ఈ దండను ఎక్కడి నుంచి తెచ్చారనే కోణంలో విచారణ జరపగా, ఆ దండను అద్దెకు తీసుకొచ్చినట్లు గుర్తించామని ఎస్పీ వెల్లడించారు.




