Happy Fathers Day 2026 : హ్యాపీ ఫాదర్స్ డే 2026.. నాన్నకు ప్రేమతో పంపించాల్సిన బెస్ట్ విషెస్, కొటేషన్స్ ఇవే

Happy Fathers Day 2026 : ఫాదర్స్ డే 2026 సందర్భంగా మీ నాన్నకు పంపించాల్సిన అద్భుతమైన శుభాకాంక్షలు, హృదయానికి హత్తుకునే మెసేజ్‌లు, కొటేషన్లు ఇవే.

CR Reddy
Published on: 21 Jun 2026 8:25 AM IST
Happy Fathers Day 2026
X

Happy Fathers Day 2026

Happy Fathers Day 2026 : మన సమాజంలో అమ్మ ప్రేమను అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు, కానీ నాన్న పడే కష్టాన్ని, త్యాగాన్ని గుర్తించే రోజులే చాలా తక్కువ. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండనక, వాననక కష్టపడుతూ తన పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించే నాన్న శ్రమకు వెలకట్టలేం. అందుకే ఆయనకు గౌరవపూర్వకంగా థాంక్స్ చెప్పడానికి జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

గుండెలకు హత్తుకునే టాప్ ఫాదర్స్ డే విషెస్

ఈ పితృ దినోత్సవం సందర్భంగా మీ నాన్నపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నాయి.

* "తాను కరిగిపోతూ మా జీవితాల్లో వెలుగులు నింపిన నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

* "నువ్వే నా ధైర్యం, నువ్వే నా గమ్యం.. ఏ కష్టం వచ్చినా ఎదురొడ్డి నిలబడటం నేర్పిన నా ప్రియమైన నాన్నకు పితృ దినోత్సవ శుభాకాంక్షలు."

* "దేవుడిచ్చిన గొప్ప బహుమతి నాన్న.. మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి కోరుకుంటున్న నాన్న...హ్యాపీ ఫాదర్స్ డే "

* "నాన్న మాటల్లో ప్రేమ అతడి కోపంలో బాధ్యత అనుక్షణం తన బిడ్డల గురించే ఆలోచనలు.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రతీ తండ్రికి, ఫాదర్స్ డే శుభాకాంక్షలు!"

* "మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ మనుకు నిత్యం గమ్యం చూపేది...నాన్న. అనురాగానికి రూపం, నాన్న హ్యాపీ ఫాదర్స్ డే! "

త్యాగానికి ప్రతిరూపం మన నాన్న

మనం ఒక వస్తువు కావాలని అడిగితే, తన జేబులో డబ్బులు లేకపోయినా ముఖంపై ఆ బాధ కనిపించకుండా తర్వాతి రోజే దాన్ని తెచ్చిచ్చే గొప్ప మనసు నాన్నది. తనకంటూ ఏ రోజూ కొత్త బట్టలు కొనుక్కోకుండా, పిల్లల చదువుల కోసం, వారి సంతోషాల కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తాడు. "నాన్న కళ్లలో ఎప్పుడూ నా భవిష్యత్ కనిపించింది, ఆయన కఠినమైన మాటల వెనుక నాపై ఉన్న అమితమైన ప్రేమే దాగుంది" అని చెప్పే కొటేషన్లు చదివితే ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం.

నాన్న నేర్పిన విలువలు - జీవిత పాఠాలు

జీవితంలో ఎదురయ్యే ఎలాంటి తుఫానైనా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో నాన్న కంటే బాగా ఎవరూ నేర్పించలేరు. మనకు నడక నేర్పడం నుంచి సమాజంలో తల ఎత్తుకుని బతికే వరకు ప్రతి అడుగులోనూ నాన్న ఒక గైడ్‌లా పక్కనే ఉంటాడు. మనం ఎక్కడైనా ఓడిపోయి నైరాశ్యంలో ఉన్నప్పుడు.. వెన్నుతట్టి "నేనున్నాను" అని చెప్పే ఆ ఒక్క మాట మనలో వంద ఏనుగుల బలాన్ని నింపుతుంది. అందుకే నాన్న కేవలం తండ్రి మాత్రమే కాదు, జీవితాంతం తోడుండే ఒక మంచి స్నేహితుడు కూడా.

ఈ రోజైనా నాన్నతో కాసేపు సమయం గడపండి

ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో కేవలం సోషల్ మీడియాలో స్టేటస్‌లు పెట్టడమే కాకుండా, వీలైతే మీ నాన్న దగ్గరకు వెళ్లి ఆయనతో కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఆయన చేసిన కష్టాన్ని గుర్తుచేసుకుంటూ ఒక చిన్న గిఫ్ట్ లేదా ప్రేమతో కూడిన కౌగిలింతను ఇస్తే వారు పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ ఫాదర్స్ డే రోజున ప్రపంచంలోని తండ్రులందరికీ, వారి అంకితభావానికి సెల్యూట్ చేస్తూ పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story