Viral Video: కన్నకొడుకును వదిలి ప్రేమికుడి కోసం.. కారులోనే పెళ్లి చేసుకున్న గృహిణి..!

Viral Video: కర్ణాటకలోని హాసన్‌లో షాకింగ్ ఘటన. అనారోగ్యంగా ఉందని ఆసుపత్రికి వెళ్లిన హర్షిత అనే మహిళ, భర్తను ఏడేళ్ల కుమారుడిని వదిలి ప్రియుడిని కారులోనే వివాహం చేసుకుంది.

Arun Chilukuri
Published on: 14 April 2026 11:54 AM IST
Viral Video
X

Viral Video: కన్నకొడుకును వదిలి ప్రేమికుడి కోసం.. కారులోనే పెళ్లి చేసుకున్న గృహిణి..!

Viral Video: ప్రేమ పిచ్చిలో పడి కన్నపేగును, కట్టుకున్న భర్తను కాదనుకుంది ఓ గృహిణి. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లై, ఏడేళ్ల కుమారుడు ఉన్నప్పటికీ.. ప్రియుడి కోసం ఇల్లు వదిలి వెళ్లి, కారులోనే దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్న ఘటన హాసన్ జిల్లాలో కలకలం రేపింది.

అసలేం జరిగిందంటే..

హర్షిత అనే మహిళకు ఎనిమిదేళ్ల క్రితం ప్రకాశ్‌ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, గత కొంతకాలంగా సచిన్ అనే యువకుడితో హర్షిత ప్రేమాయణం సాగిస్తోంది. మార్చి 30న తనకు ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రికి వెళ్లి వస్తానని భర్తకు చెప్పి హర్షిత బయటకు వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త, అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కారులో పెళ్లి.. వైరల్ వీడియో:

పోలీసులు గాలింపు చేపట్టి సోమవారం హర్షితను హాసన్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. పోలీసుల విచారణలో ఆమె ఇచ్చిన సమాధానం విని అందరూ అవాక్కయ్యారు. తాను సచిన్‌ను ఇష్టపడుతున్నానని, ఇప్పటికే కారులోనే అతడిని వివాహం చేసుకున్నానని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

నచ్చజెప్పినా వినని మహిళ:

"నాకు భర్త ప్రకాశ్ వద్దు.. కన్నకొడుకు కూడా వద్దు. నేను సచిన్‌తోనే ఉంటాను" అని హర్షిత భీష్మించుక కూర్చుంది. తల్లిదండ్రులు, భర్త ఎంత బతిమాలినా ఆమె వినకపోవడంతో పోలీసులు ఆమెను ప్రభుత్వ మహిళా సాంత్వన కేంద్రానికి తరలించారు. ఏడేళ్ల పసివాడిని వదిలి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story