Weeks: ఆదివారం, సోమవారం పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా.? ఆసక్తికర నిజాలు..
Weeks: మనం నిత్యం వాడే ఆదివారం, సోమవారం వంటి వారాల పేర్లు ఎలా ఏర్పడ్డాయో ఎప్పుడైనా ఆలోచించారా.? ఖగోళ శాస్త్రం, సూర్య సిద్ధాంతం ప్రకారం ఆకాశంలోని గ్రహాల గమనం ఆధారంగా వీటికి పేర్లు ఎలా వచ్చాయో ఇక్కడ తెలుసుకోండి.
Weeks: ఆదివారం, సోమవారం పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా.? ఆసక్తికర నిజాలు..
Weeks: మన దైనందిన జీవితంలో కాలం కొలమానంగా వారాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం అంటూ ప్రతిరోజూ మనం ఈ పేర్లను ఎంతో సహజంగా ఉపయోగిస్తుంటాం. అయితే అసలు ఈ వారాల పేర్లు ఎలా వచ్చాయి? వాటి వెనుక ఉన్న చారిత్రక, శాస్త్రీయ నేపథ్యం ఏంటనే ఆసక్తికరమైన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. శాస్త్రవేత్తలు, ఖగోళ నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం, ఈ వారాల పేర్లు ఆకాశంలోని గ్రహాల గమనం, ఖగోళ శాస్త్రం, ప్రాచీన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఏర్పడ్డాయి.
మన సౌర కుటుంబంలోని శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాల క్రమాన్ని అనుసరించి ఒక రోజును 24 గంటలుగా లేదా హోరాలుగా విభజించడం జరిగిందని పెద్దలు చెబుతారు. ఏ రోజు ఉదయం తొలి హోరా ఏ గ్రహానికి వస్తుందో, ఆ గ్రహం పేరే ఆ రోజుకు వారంగా స్థిరపడిందని ఖగోళ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు సూర్యుడికి సంబంధించిన హోర మొదట వచ్చే రోజును ఆదివారంగా పిలవడం ప్రారంభించారు. అలా ఒక్కో గ్రహం ఆధారంగా క్రమేణా మిగతా వారాల పేర్లు కూడా ఖరారయ్యాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి.
కాగా, కాలక్రమేణా ప్రాచీన సంస్కృత పదమైన 'హోరా' అనే పదం రూపాంతరం చెంది ఇంగ్లీషులో అవర్‌గా మారిందని చరిత్ర చెబుతోంది. పూర్వకాలం నుంచే మన పూర్వీకులు ఖగోళ శాస్త్రంపై ఎంతటి గట్టి పట్టు కలిగి ఉన్నారో ఈ నామకరణ విధానం స్పష్టంగా తెలియజేస్తోంది. గ్రహాల గమనాన్ని బట్టి కాలాన్ని విభజించి, వాటికి దేవుళ్ల లేదా గ్రహాల పేర్లు పెట్టడం వెనుక బలమైన శాస్త్రీయ కోణం దాగి ఉంది. నిత్య జీవితంలో మనం వాడే ప్రతి పదం వెనుక ఇన్ని ఆసక్తికరమైన విషయాలు ఉండటం నిజంగా విశేషం.




