Kitchen Hacks: పాల కల్తీని సింపుల్‌గా ఇలా గుర్తించండి.! ఇదిగో చిట్కాలు..
Kitchen Hacks: నిత్యం మనం తాగే పాలలో కల్తీ జరిగిందా లేదా అని తెలుసుకోవడం చాలా అవసరం.
Kitchen Hacks: పాల కల్తీని సింపుల్‌గా ఇలా గుర్తించండి.! ఇదిగో చిట్కాలు..
Kitchen Hacks: పాలు మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే, కొందరు వ్యాపారులు లాభాల కోసం పాలలో నీళ్లు, డిటర్జెంట్, సింథటిక్ పదార్థాలు, యూరియా లాంటి హానికరమైన రసాయనాలను కలుపుతున్నారు.
ఇలాంటి కల్తీ పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. మన ఇంటికి వచ్చే పాలు స్వచ్ఛమైనవో కాదో ఇంట్లోనే సులభంగా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పాలలో కల్తీని గుర్తించేందుకు 4 సులభమైన పద్ధతులు ఇవే:
డిటర్జెంట్ కల్తీ: ఒక బాటిల్‌లో కొన్ని పాలు పోసి బాగా షేక్ చేయండి. పాలలో గనుక డిటర్జెంట్ కలిస్తే అందులో నుంచి నురగ ఎక్కువగా వస్తుంది.
నీళ్ల కల్తీ: పాలను ఒక ప్లేట్ లేదా వాలుగా ఉన్న టైల్స్‌పై పోయండి. ఎక్కువ నీరు కలిసిన మిల్క్ అయితే చాలా త్వరగా కిందికి ప్రవహిస్తాయి.
సింథటిక్ పాలు: సింథటిక్ కలిపిన పాలైతే, కొద్దిగా పాలను అరచేతిలో పోసుకొని రుద్దినప్పుడు సబ్బులా జారిన ఫీలింగ్ వస్తుంది.
యూరియా కల్తీ: కొన్ని పాలలో కొద్దిగా సోయాబీన్ పొడి కలపండి. పాలు స్వచ్ఛమైనవి అయితే వాటి వాసనలో ఎలాంటి మార్పూ ఉండదు. ఒకవేళ పాలలో యూరియా కలిస్తే మాత్రం ఘాటైన అమ్మోనియా స్మెల్ వస్తాయి.




