Husband: 20 ఏళ్లు భార్యతో మాట్లాడని భర్త.. కాని పిల్లలు మాత్రం ముగ్గురు

Husband: జపాన్‌లో 20 ఏళ్లుగా భార్యతో మాట్లాడని భర్త.

Naresh.k
Published on: 25 July 2026 11:26 AM IST
Husband
X

Husband: 20 ఏళ్లు భార్యతో మాట్లాడని భర్త.. కాని పిల్లలు మాత్రం ముగ్గురు

Husband: జపాన్‌లో జరిగిన ఓ విచిత్ర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఒకటి రెండు రోజులు మాట్లాడుకోకపోవడం సహజం. కానీ, ఒకే ఇంట్లో ఉంటూ, ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి.. ఏకంగా 20 సంవత్సరాల పాటు భార్యతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఓ భర్త.

జపాన్‌కు చెందిన ఒటో కటాకియమా, ఆయన భార్య యుమి దంపతులు. ఒటో తన పిల్లలతో సరదాగా మాట్లాడేవాడు కానీ, భార్య యుమి వైపు మాత్రం కనీసం చూసేవాడు కాదు. ఆమె మాట్లాడటానికి ప్రయత్నిస్తే కేవలం సైగలు చేసేవాడు తప్ప నోరు విప్పేవాడు కాదు. అలా ఏకంగా రెండు దశాబ్దాలు గడిచాయి.

తల్లిదండ్రుల మధ్య ఈ మూగ పోరాటాన్ని చూసి పెరిగిన వారి 18 ఏళ్ల కొడుకు యోషికీ ఎలాగైనా ఈ సమస్యకు ముగింపు పలకాలనుకున్నాడు. ఇందుకోసం ఓ ప్రముఖ జపనీస్ టీవీ షోను ఆశ్రయించాడు. ఆ షో నిర్వాహకులు ఆ దంపతులను వారు మొదట కలుసుకున్న పార్కుకు రప్పించారు. అక్కడ పిల్లలు దాక్కుని చూస్తుండగా.. 20 ఏళ్ల తర్వాత ఒటో భార్యతో నోరు విప్పి మాట్లాడాడు.

పిల్లల పెంపకంలో ఎంతో శ్రమించావు, ఇన్నాళ్లూ నాతో ఉన్నందుకు ధన్యవాదాలు" అని ఒటో అనగానే ఆ దంపతులతో పాటు పిల్లలు కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు భార్యతో ఎందుకు మాట్లాడలేదని అడిగితే.. పిల్లలు పుట్టాక భార్య నాకంటే వాళ్లకే ఎక్కువ ప్రేమ, శ్రద్ధ చూపుతోంది అనే చిన్నపిల్లాడి లాంటి అసూయ వల్లే తాను మాట్లాడటం మానేశానని ఒటో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చివరికి కొడుకు చొరవతో ఆ దంపతులు మళ్లీ ఒక్కటయ్యారు. ఈ ఘటన బంధాలలో కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో మనకు నేర్పుతుంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story