Viral: ఇలాంటి కొడుకు పుట్టడం నిజంగా అదృష్టం.. ఏకంగా రూ. 2.90 కోట్ల ఆఫర్ వదిలేశాడు

Viral: తన కెరీర్, కోట్ల రూపాయల జీతం కంటే తల్లిదండ్రులకు సేవ చేయడమే తన జీవితంలో నిజమైన గెలుపని ఓ కొడుకు నిరూపించాడు.

Ravi
By Ravi
Published on: 5 July 2026 1:00 PM IST
Viral
X

Viral: ఇలాంటి కొడుకు పుట్టడం నిజంగా అదృష్టం.. ఏకంగా రూ. 2.90 కోట్ల ఆఫర్ వదిలేశాడు

Viral: తన కెరీర్, కోట్ల రూపాయల జీతం కంటే కన్న తల్లిదండ్రులకు సేవ చేయడమే తన జీవితంలో నిజమైన గెలుపని ఓ ఆదర్శవంతమైన కొడుకు నిరూపించాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వివేక్ శర్మ అనే యువకుడు తన గొప్ప నిర్ణయంతో ప్రస్తుతం నెట్టింట రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు.

వివేక్ శర్మ దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఐఐటీ బాంబేలో చదివి, తన ప్రతిభతో గోల్డ్ మెడల్ సైతం సాధించాడు. అతని అద్భుతమైన టాలెంట్‌ను గుర్తించిన అమెరికాలోని ఒక అగ్రగామి కంపెనీ అతనికి ఏకంగా ఏడాదికి రూ.2.90 కోట్ల భారీ వేతనంతో ఉద్యోగం ఆఫర్ చేసింది.

అయితే, సరిగ్గా అదే సమయంలో వివేక్ తండ్రికి తీవ్రమైన గుండెపోటు రావడం, ఆ వెంటనే తల్లికి క్యాన్సర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ కష్టకాలంలో వాళ్లను ఒంటరిగా వదిలి విదేశాలకు వెళ్లడం ఇష్టం లేక, ఆ కోట్లు కురిపించే అమెరికా ఆఫర్‌ను వివేక్ సున్నితంగా వదిలేశాడు. తల్లిదండ్రుల బాగోగులు దగ్గరుండి చూసుకుంటూనే, వారి కోసం స్థానికంగా ఓ చిన్న కిరాణా షాపును నడుపుతున్నాడు.

అంతేకాకుండా, స్థానికంగా ఉన్న పేద విద్యార్థులకు ఉచితంగా కోడింగ్ నేర్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. డబ్బు, కెరీర్ కంటే తనను కన్న కుటుంబమే ముఖ్యమని నిరూపించిన వివేక్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి కొడుకు పుట్టడం నిజంగా ఆ తల్లిదండ్రుల అదృష్టమంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story