Viral News : 45 రోజుల ముందే లీవ్ అడిగినా నో.. ఐటీ మేనేజర్‌పై నెటిజన్ల ఫైర్.!

Viral News : కార్పొరేట్ కంపెనీలలో పనిచేసే ఐటీ ఉద్యోగులకు పనిభారంతో పాటు సెలవులు దొరకడం కూడా పెద్ద ప్రసహసనంగా మారుతోంది.

G Krishna
Published on: 14 Aug 2026 7:29 PM IST
IT Employees
X

 IT Employees

Viral News : కార్పొరేట్ కంపెనీలలో పనిచేసే ఐటీ ఉద్యోగులకు పనిభారంతో పాటు సెలవులు దొరకడం కూడా పెద్ద ప్రసహసనంగా మారుతోంది. అత్యవసర పనులున్నా, ప్లాన్ చేసుకున్న ట్రిప్పులున్నా సెలవు అడగాలంటే మేనేజర్ల ముందు నానా తంటాలు పడాల్సి వస్తోంది. తాజాగా 45 రోజుల ముందే ప్రయాణం గురించి స్పష్టంగా సమాచారం ఇచ్చినా, ఒక మేనేజర్ లేడీ టెకీకి లీవ్ నిరాకరించిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన వివరాలను బాధిత ఉద్యోగి భర్త రెడ్డిట్‌లో పంచుకోవడంతో ఈ వ్యవహారం వైరల్‌గా మారింది.

డెవలపర్స్ ఇండియా రెడ్డిట్‌లో వెలుగులోకి చీకటి కోణం

‘డెవలపర్స్ ఇండియా’ (r/developersIndia) అనే రెడ్డిట్ పేజీలో ఒక టెకీ పోస్ట్ చేస్తూ కార్పొరేట్ వర్క్ కల్చర్‌లోని లోపాలను ఎండగట్టాడు. ఆయన భార్య భారతదేశంలోని ఒక ప్రముఖ దిగ్గజ ఐటీ సేవల కంపెనీలో పనిచేస్తోంది. వీరిద్దరూ ప్రయాణానికి (Travel Plan) దాదాపు నెలన్నర (45 రోజులు) ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుని, ఈ విషయాన్ని టీమ్ లీడ్ , మేనేజర్‌కు తెలియజేశారు. అయితే, అంత ముందుగా సమాచారం ఇచ్చినప్పటికీ ఆ మేనేజర్ సెలవు మంజూరు చేయడానికి అంగీకరించకపోగా, ప్రయాణ తేదీలను మార్చుకోవాలని పట్టుబట్టడం గమనార్హం.

'డేట్స్ మార్చడం అంత తేలిక కాదు'.. హెచ్‌ఆర్‌కు చెప్పాలా.?

ప్రయాణ తేదీలను మార్చడం అనుకున్నంత సులభం కాదని, ఇప్పటికే విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్ పూర్తి కావడం వల్ల ఒక్క రోజు అటుఇటు అయినా వేలల్లో ఖర్చులు పెరుగుతాయని సదరు టెకీ ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య గత ఐదేళ్లుగా అదే కంపెనీలో నమ్మకంగా పనిచేస్తోందని, ఆమె ఖాతాలో చాలా సెలవులు మిగిలే ఉన్నాయని పేర్కొన్నాడు. లీవ్ రోజుల్లో అత్యవసర పని ఉంటే స్లాక్ (Slack) లేదా వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటానని చెప్పినా మేనేజర్ వినకుండా తేదీలు మార్చాలంటూ వేధిస్తున్నాడని తెలిపాడు. ఈ పరిస్థితిలో మేనేజర్‌కు మళ్లీ నచ్చజెప్పాలా లేక నేరుగా హెచ్‌ఆర్ (HR) టీమ్‌ను సంప్రదించాలా అని నెటిజన్ల సలహా కోరాడు.

తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు.. హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేయడమే సరైన మార్గం

ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఐటీ మేనేజర్ల వైఖరిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "కార్పొరేట్ కంపెనీల్లో మన హక్కుగా రావలసిన సెలవును అడిగినా ఉద్యోగులను అపరాధులుగా, పనికిరాని వారిగా చూస్తారు" అని ఒక వినియోగదారుడు కామెంట్ చేశాడు. "ఉద్యోగంతో పాటు వ్యక్తిగత జీవితం, మానసిక ప్రశాంతత కూడా ముఖ్యం. ఇలాంటి టాక్సిక్ వాతావరణం ఉన్న చోట ఉండకుండా వేరే కంపెనీకి మారడానికి ప్రయత్నించండి" అని మరొకరు సలహా ఇచ్చారు. ఇక మెజారిటీ నెటిజన్లు మాత్రం మేనేజర్‌తో మళ్లీ మాట్లాడి సమయం వృథా చేసుకోవద్దని, 45 రోజుల క్రితమే ఇచ్చిన లీవ్ అప్లికేషన్ ఆధారంగా నేరుగా హెచ్‌ఆర్‌ను కలిసి లీవ్ కన్ఫర్మేషన్ తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.

Manager at WITCH level companies not approving leaves
by

u/Historical_day_364 in

developersIndia

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story