Viral: ఏఐతో ప్రాక్టీస్.. కట్ చేస్తే.. రూ.1.5 కోట్ల భారీ ప్యాకేజీతో జాబ్ కొట్టేసిన వ్యక్తి.!
Viral: లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయి ఇబ్బంది పడిన ఒక వ్యక్తి కృత్రిమ మేధస్సు సాయంతో అద్భుతం సాధించాడు.
Viral: ఏఐతో ప్రాక్టీస్.. కట్ చేస్తే.. రూ.1.5 కోట్ల భారీ ప్యాకేజీతో జాబ్ కొట్టేసిన వ్యక్తి.!
Viral: ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం సాధారణ సహాయానికే కాకుండా, కొందరు దీనిని తమ కెరీర్‌ను మలుపు తిప్పుకోవడానికి కూడా సమర్థవంతంగా వాడుకుంటున్నారు. లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగం కోల్పోయి, వరుస ఇంటర్వ్యూలలో విఫలమై నిరాశలో కూరుకుపోయిన ఒక వ్యక్తి చివరికి ఏఐ సాయంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఏకంగా రూ.1.5 కోట్ల భారీ వార్షిక ప్యాకేజీతో సరికొత్త ఉద్యోగాన్ని సాధించినట్లు ఒక రెడ్డిట్ యూజర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఉద్యోగ వేటలో భాగంగా ఆ వ్యక్తి జాబ్ డిస్క్రిప్షన్, ఇంటర్వ్యూ చేసే వారి ప్రొఫైల్ వివరాలను ఏఐ టూల్స్‌కు అందించాడు. వాటి ఆధారంగా నిపుణుడిలా మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించుకుంటూ కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు ప్రాక్టీస్ చేశాడు. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో సమాధానాలు చెప్పేందుకు 'STAR' (Situation, Task, Action, Result) విధానాన్ని అనుసరించి తన ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఈ పద్ధతి ద్వారా ఏఐ సాయంతో ప్రతి ప్రశ్నకు స్పష్టమైన, ఆకట్టుకునే సమాధానాలను ముందే సిద్ధం చేసుకుని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలను ఎదుర్కొన్నాడు.
కాగా, ఏఐ సాయంతో తాను చేసిన ఈ కృషడే తన విజయానికి ప్రధాన కారణమని ఆ వ్యక్తి వెల్లడించాడు. సరైన పద్ధతిలో ఏఐని ఉపయోగించుకుంటే నిరుద్యోగ సమస్యను అధిగమించి ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్ఫూర్తిదాయక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, టెక్ నిపుణులు, ఉద్యోగులకు ఏఐని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకునేందుకు అమితమైన ఆసక్తి చూపుతున్నారు.




