Viral Video: బలవంతంగా కౌగిలించుకోబోయిన సీనియర్ నేత.. షాక్‌కు గురైన ఎమ్మెల్యే..!
Viral Video: కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే బిందు కృష్ణ పట్ల సీనియర్ నేత చెరియన్ ఫిలిప్ అభ్యంతరకరంగా ప్రవర్తించారు. కేపీసీసీ కార్యాలయంలో అందరూ చూస్తుండగానే ఆమెను బలవంతంగా కౌగిలించుకోబోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: బలవంతంగా కౌగిలించుకోబోయిన సీనియర్ నేత.. షాక్‌కు గురైన ఎమ్మెల్యే..!
Viral Video: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత నుంచే తీవ్ర అవమానం ఎదురైంది. కనీస విచక్షణ లేకుండా, బహిరంగంగానే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.
ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) విజయం సాధించిన సంగతి తెలిసిందే. కొల్లాం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున బిందు కృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలోని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి ఆమె హాజరయ్యారు.
కార్యాలయంలోకి ప్రవేశిస్తున్న సమయంలో అక్కడ ఉన్న తోటి నేతలను ఆమె మర్యాదపూర్వంగా పలకరిస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సీనియర్ నేత చెరియన్ ఫిలిప్‌ను పలకరించగా.. ఆయన హద్దులు దాటి ప్రవర్తించారు. అందరూ చూస్తుండగానే ఆమెను బలవంతంగా కౌగిలించుకునేందుకు ప్రయత్నించారు. బిందు కృష్ణ తీవ్ర అసహనానికి గురై, ఇబ్బంది పడుతూ ఆయనను వదిలించుకొని వేగంగా లోపలికి వెళ్లిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పటికే అక్కడ పలువురు సీనియర్ నేతలు, మీడియా ప్రతినిధులు ఉన్నప్పటికీ ఆయన ఏమాత్రం వెనకాడకపోవడం గమనార్హం. "ఒక మహిళా ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేదా? పార్టీ కార్యాలయంలోనే ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటు" అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సదరు నేతపై కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అధికారికంగా ఎమ్మెల్యే హోదాలో ఉన్న మహిళకే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.




