Viral: రూ. 500తో లాటరీ టికెట్.. కట్ చేస్తే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.! ఎంతొచ్చిందంటే.?

Viral: కేరళలో ఇటీవల ముగిసిన ఓనం పండుగ బంపర్ లాటరీలో ఒక వ్యక్తికి రూ. 30 కోట్ల జాక్‌పాట్ తగిలింది.

Ravi
By Ravi
Published on: 28 Sept 2026 9:43 PM IST
Viral
X

Viral: రూ. 500తో లాటరీ టికెట్.. కట్ చేస్తే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.! ఎంతొచ్చిందంటే.?

Viral: భారతీయ రాష్ట్రాలలో లాటరీ నిర్వహణకు సంబంధించి కేరళ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అధికారికంగా లాటరీలు నిర్వహించబడుతుంటాయి. ప్రతి సంవత్సరం ఓనం పండుగ సందర్భంగా నిర్వహించే తిరువోణం బంపర్ లాటరీకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల అత్యంత వైభవంగా ముగిసిన ఓనం పండుగ సందర్భంగా కేరళ ప్రభుత్వం నిర్వహించిన బంపర్ లాటరీకి సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ అదృష్ట డ్రాలో ఒక సాధారణ వ్యక్తికి భారీ జాక్‌పాట్ తగిలినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ లాటరీకి సంబంధించి ఫస్ట్ ప్రైజ్ కింద ఏకంగా రూ. 30 కోట్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం రూ. 500 పెట్టి కొనుగోలు చేసిన ఒకే ఒక్క టికెట్ ఆ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. అయితే ఆ భారీ బహుమతి గెలుచుకున్న అదృష్టవంతుడు ఎవరనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. భద్రతా కారణాల దృష్ట్యా లాటరీ నిర్వాహకులు విజేత వివరాలను గోప్యంగా ఉంచినట్లు సమాచారం. త్వరలోనే ఆ వ్యక్తి అధికారికంగా లాటరీ అధికారులను కలిసి బహుమతిని క్లెమ్ చేసుకునే అవకాశం ఉంది.

ఈ ఫెస్టివల్ సీజన్‌లో కేరళ వ్యాప్తంగా మొత్తం 90 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు లాటరీ శాఖ తెలిపింది. ఒక్కో టికెట్ ధర రూ. 500 ఉండగా, ప్రజలు ఎంతో ఉత్సాహంగా వీటిని కొనుగోలు చేశారు. కేవలం మొదటి బహుమతి మాత్రమే కాకుండా సెకండ్ ప్రైజ్ కింద ఇరవై మందికి రూ. కోటి చొప్పున బహుమతులు అందజేయనున్నారు. అలాగే థర్డ్ ప్రైజ్ కింద మరో ఇరవై మందికి రూ. 25 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ భారీ లాటరీ గెలుపునకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రభుత్వ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిగే ఈ లాటరీ డ్రా ద్వారా ఎంతోమంది సాధారణ ప్రజలు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతుంటారు. ఈసారూ ఓనం బంపర్ లాటరీ విజేతగా నిలిచిన వ్యక్తి ఎవరనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇలాంటి భారీ జాక్‌పాట్‌లు ప్రజలలో లాటరీలపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయని చెప్పవచ్చు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.