Gas Cylinder: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్.. ఈ-కేవైసీ చేయకపోతే బుకింగ్ క్యాన్సిల్!
Gas Cylinder: వంటగ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి. ఈ-కేవైసీ పూర్తి చేయనివారికి సిలిండర్ బుకింగ్స్ రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Gas Cylinder: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్.. ఈ-కేవైసీ చేయకపోతే బుకింగ్ క్యాన్సిల్!
Gas Cylinder: దేశవ్యాప్తంగా ఉన్న వంటగ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్యాస్ సిలిండర్ సబ్సిడీని సక్రమంగా పంపిణీ చేయడానికి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఆగస్టు 16 వరకు గడువు ఉన్నప్పటికీ, ఆచరణలో మాత్రం నిబంధనలు ముందే అమలవుతున్నాయి. గడువు ముగియడానికి ముందే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు 1 నుంచే సిలిండర్ల పంపిణీని నిలిపివేస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేస్తున్నారు. e-KYC పూర్తి చేయని వారి గ్యాస్ బుకింగ్స్‌ను ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది.
ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేశాయి. ఎవరైనా ఇంకా కేవైసీ పూర్తి చేయకపోతే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి నేరుగా వెళ్లడం ద్వారా, డెలివరీ బాయ్ సహాయం తీసుకోవడం ద్వారా లేదా ఆన్‌లైన్ మొబైల్ అప్లికేషన్ల ద్వారా సులభంగా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. కాగా, ఎలాంటి అంతరాయం లేకుండా వంటగ్యాస్ సిలిండర్ పొందాలంటే వినియోగదారులు వెంటనే ఈ నిబంధనను పాటించాలని అధికారులు కోరుతున్నారు.




