Viral Video: వీడెవడ్రా బాబోయ్.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే ఫైటింగ్‌కు దిగాడు!

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక షాకింగ్ వీడియోలో.. ఒక వ్యక్తి పాముతో ఫైటింగ్‌కు దిగాడు.

Arun Chilukuri
Published on: 19 Jun 2026 11:47 AM IST
Viral Video
X

Viral Video: వీడెవడ్రా బాబోయ్.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే ఫైటింగ్‌కు దిగాడు!

Viral Video: సాధారణంగా పాము కనిపిస్తే చాలు ఎంతటి వారైనా భయంతో ఆమడ దూరం పారిపోతారు. కొందరైతే చీకట్లో తాడును చూసి కూడా కోబ్రా అనుకుని హడలిపోతారు. కానీ, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా రీల్స్, లైకుల పిచ్చితో కొందరు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాములతో ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఒక విస్తుపోయే వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.

ఓ పంట పొలం గట్టున ఒక వ్యక్తి ఏకంగా ఒక విషసర్పంతో ఫైటింగ్‌కు దిగాడు. సదరు వ్యక్తి పదే పదే ఆ పామును ఫుట్‌బాల్‌ను తన్నినట్లు కాలితో తన్నడం వీడియోలో కనిపిస్తోంది. అయితే, ఆ కోబ్రా కూడా ఏమాత్రం తగ్గకుండా అతడిపై పగ తీర్చుకోవాలన్నట్లు పదే పదే ఎదురుదాడికి దిగింది.

అతను ఎన్నిసార్లు కాలితో తన్ని నీళ్లలో పడేసినా.. ఆ పాము మళ్లీ మళ్లీ పైకి లేచి అతనిపైకి దూసుకొచ్చింది. ఇలా కొద్దిసేపటి వరకు ఆ వ్యక్తికి, కోబ్రాకు మధ్య హై ఓల్టేజ్ ఫైటింగ్ నడిచింది. చివరకు ఆ పాము అలసిపోయి.. 'వీడితో నాకెందుకులే' అనుకుందో ఏమో కానీ, మెల్లగా నీళ్లలో నుంచి పొలాల్లోకి జారుకుంది.

అక్కడ ఉన్న కొందరు ఈ దృశ్యాలను రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. "వీడేంట్రా బాబోయ్.. ఇంత వైలెంట్‌గా ఉన్నాడు", "రీల్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు" అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story