Viral News: ‘నాకు ప్రియుడే కావాలి’.. సెల్‌ టవర్ ఎక్కి వివాహిత హైడ్రామా!

Hathras Drama: తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని, ప్రియుడితోనే ఉంటానంటూ హాథ్రస్‌లో ఒక వివాహిత సెల్ టవర్ ఎక్కి హంగామా చేసింది. పోలీసులు ఆమె ప్రియుడిని పిలిపించి కిందకు దించిన వైనం.

Arun Chilukuri
Published on: 29 April 2026 12:01 PM IST
Viral News:
X

Viral News: ‘నాకు ప్రియుడే కావాలి’.. సెల్‌ టవర్ ఎక్కి వివాహిత హైడ్రామా!

Hathras Drama: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లాలో ఒక వివాహిత చేసిన పని స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని, తన ప్రియుడితోనే కలిసి ఉంటానంటూ ఆమె ఏకంగా సెల్‌ టవర్ ఎక్కి కూర్చుంది. సుమారు మూడు గంటల పాటు మండుటెండలో ఆమె చేసిన ఈ 'హై వోల్టేజ్' డ్రామా పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి చుక్కలు చూపించింది.

పోలీసుల కథనం ప్రకారం.. పూజ (30) అనే మహిళకు రెండేళ్ల క్రితం హాథ్రస్ జంక్షన్ పరిధిలోని బర్మనే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే, మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా అత్తింటి నుంచి బయటకు వచ్చిన ఆమె, సమీపంలోని లూట్సాన్ రోడ్డులో ఉన్న ఎత్తైన సెల్‌ టవర్‌పైకి ఎక్కింది. ఆమెను అంత ఎత్తులో చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ఆమెను కిందకు దించేందుకు ఎంత ప్రయత్నించినా ఆమె ససేమిరా అంది. చివరకు ఆమె ప్రియుడిని అక్కడికి పిలిపించి, నచ్చజెప్పడంతో పూజ మెల్లగా కిందకు దిగొచ్చింది. అధికారులు కింద జంపింగ్ బెడ్లు ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

కిందకు దిగిన తర్వాత పూజ పోలీసులతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, బలవంతంగా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన పక్క గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తున్నానని, తనను అతడి వద్దకే పంపాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story