Maths Puzzle: మెదడుకు పనిపెట్టే పజిల్.. ఆన్సర్ చెప్పడం అంత ఈజీ కాదు.. 15 సెకండ్లలో చెబితే మిరే తోపు!
Viral Maths Puzzle. త్రిభుజాల ఆధారంగా రూపొందించిన ఓ ఆసక్తికరమైన మ్యాథ్స్ పజిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Maths Puzzle: మెదడుకు పనిపెట్టే పజిల్.. ఆన్సర్ చెప్పడం అంత ఈజీ కాదు.. 15 సెకండ్లలో చెబితే మిరే తోపు!
Maths Puzzle: సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్, లాజికల్ పజిల్స్, మ్యాథ్స్ బ్రెయిన్ టీజర్లు తరచూ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి పజిల్స్ నెటిజన్ల పరిశీలనా శక్తితో పాటు లాజికల్ థింకింగ్, గణిత పరిజ్ఞానాన్ని కూడా పరీక్షిస్తాయి. తాజాగా త్రిభుజాల ఆధారంగా రూపొందించిన ఓ ఆసక్తికరమైన మ్యాథ్స్ పజిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చూడటానికి సింపుల్‌గా కనిపిస్తున్నప్పటికీ.. ఇందులోని లాజిక్‌ను గుర్తించడంలో చాలామంది నెటిజన్లు తికమకపడుతున్నారు. 100లో 90 మంది తప్పుగానే చెబుతున్నారు.
ఇంతకీ పజిల్ ఏంటి?:
ఈ వైరల్ పజిల్‌లో మొత్తం మూడు త్రిభుజాలు ఉన్నాయి. ప్రతి త్రిభుజం మూడు భాగాలుగా విభజించబడి ఉంటుంది. పై భాగాల్లో రెండు సంఖ్యలు, కింది భాగంలో ఒక సంఖ్య ఉంటుంది. మొదటి త్రిభుజంలో పైభాగంలో 2, 2 ఉండగా.. కింద 8 ఉంది. రెండో త్రిభుజంలో 5, 5 ఉండగా.. కింది భాగంలో 50 ఇచ్చారు. ఇక మూడో త్రిభుజంలో పైభాగంలో 6, 6 ఉన్నాయి. కింది భాగంలో ఏ సంఖ్య వస్తుందో చెప్పాల్సి ఉంది. ఈ పజిల్‌లో అసలు సవాలు ఏంటంటే.. 15 సెకన్లలో సమాధానం చెప్పడం. సమయంలోగా మీరు ఆన్సర్ చెప్పగలరేమో ప్రయత్నించండి.
అసలు లాజిక్ ఏంటి?:
ఈ పజిల్‌లో ఉన్న నంబర్ల మధ్య సంబంధాన్ని గమనిస్తే.. ఒక సులభమైన గణిత సూత్రం కనిపిస్తుంది. పైభాగంలో ఉన్న రెండు సంఖ్యల వర్గాలను (Squares) తీసుకుని వాటిని కలిపితే కింది సంఖ్య వస్తుంది. మొదటి త్రిభుజాన్ని పరిశీలిస్తే.. పైభాగంలో 2, 2 ఉన్నాయి. వాటి వర్గాలను తీసుకుంటే 2² + 2² = 4 + 4 = 8. దీంతో కింద ఇచ్చిన 8 సరైనదేనని అర్థమవుతుంది. ఇక రెండో త్రిభుజంలో 5, 5 ఉన్నాయి. అదే లాజిక్‌ను ఉపయోగిస్తే 5² + 5² = 25 + 25 = 50. ఇక్కడ కూడా కింది సంఖ్య 50 రావడంతో ఈ గణిత సూత్రం సరైనదేనని నిర్ధారించవచ్చు.
సరైన ఆన్సర్ 76:
ఇప్పుడు ఇదే లాజిక్‌ను మూడో త్రిభుజానికి వర్తింపజేయాలి. ఇందులో పైభాగంలో 6, 6 ఉన్నాయి. కాబట్టి వాటి వర్గాలను తీసుకుని కూడాలి. 6² + 6² = 36 + 36 = 72. మూడో త్రిభుజంలోని ప్రశ్నార్థకం స్థానంలో రావాల్సిన నంబర్ 72. ఈ పజిల్‌లో పెద్దగా క్లిష్టమైన లెక్కలు ఏమీ లేవు. ఇచ్చిన ఉదాహరణల్లోని సంఖ్యల మధ్య ఉన్న గణిత సంబంధాన్ని గుర్తించడమే అసలు ట్విస్ట్. మీరు కూడా ఈ పజిల్‌ను 15 సెకన్లలోనే పరిష్కరించగలిగితే.. మీ లాజికల్ థింకింగ్, పరిశీలనా శక్తి బాగున్నట్టే. ఈ పజిల్‌ను మీ స్నేహితులు, కుటుంబసభ్యులకు పంపి వారు సమాధానం చెబుతారో లేదో చూడండి.




