Maths Puzzle: 10 సెకన్లలో ఈ మ్యాథ్స్ పజిల్‌ను సాల్వ్ చేయగలరా?.. సరైన ఆన్సర్ చెబితే మీకంటే తోపెవరు లేరిక్కడ!

Maths Puzzle: సోషల్ మీడియాలో కొన్ని మ్యాథ్స్ పజిల్స్ వైరల్ అవుతుంటాయి. చూడటానికి అవి చాలా సింపుల్‌గా కనిపించినా.. సాల్వ్ చేయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది.

Rishvik
Published on: 23 Aug 2026 11:12 PM IST
Maths Puzzle
X

Maths Puzzle: 10 సెకన్లలో ఈ మ్యాథ్స్ పజిల్‌ను సాల్వ్ చేయగలరా?.. సరైన ఆన్సర్ చెబితే మీకంటే తోపెవరు లేరిక్కడ!

Maths Puzzle: సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని మ్యాథ్స్ పజిల్స్ వైరల్ అవుతుంటాయి. చూడటానికి అవి చాలా సింపుల్‌గా కనిపించినా.. సాల్వ్ చేయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వాటిలో దాగి ఉన్న ప్యాటర్న్, లాజిక్‌ను గుర్తించడానికి కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఓ నంబర్ పజిల్ నెటిజన్లను తెగ ఆలోచింపజేస్తోంది. ఇందులో ఇచ్చిన నంబర్ల మధ్య ఉన్న సంబంధాన్ని కేవలం 10 సెకన్లలో గుర్తించగలిగితే.. మీ లాజికల్ థింకింగ్ అద్భుతంగా ఉన్నట్లే.

ఈ పజిల్‌లో 10 = 110, 9 = 90, 8 = 72, 7 = 56 అని ఇచ్చారు. చివరగా 5కు ఎంత విలువ వస్తుందో కనుక్కోవాలని సోషల్ మీడియాలో ఓ ఛాలెంజ్ విసిరారు. ముందుగా చూసినప్పుడు ఈ సంఖ్యల మధ్య సంబంధం ఏంటో అర్థం కాక చాలామంది తికమకపడతారు. కానీ ఒక్కసారి ప్యాటర్న్‌ను గమనిస్తే.. సమాధానం చాలా సులభంగా తెలిసిపోతుంది. అయితే ఈ పజిల్‌కు 100లో 99 మంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. కొందరు మాత్రమే సరైన సమాధానం ఇవ్వగా.. చాలా మంది పప్పులో కాలేశారు. మీకు సమాధానం తెలియకుంటే.. అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. కింది ఆర్టికల్లో పూర్తిగా వివరించాము.

ఇచ్చిన మొదటి సమీకరణను పరిశీలిస్తే.. 10 = 110 అంటే 10ను దాని తర్వాత వచ్చే సంఖ్య 11తో గుణిస్తే 110 వస్తుంది. అంటే 10 × 11 = 110. అలాగే 9 = 90 విషయానికి వస్తే.. 9 × 10 = 90. ఇక 8 = 72 అంటే.. 8 × 9 = 72. అలానే 7 = 56 అంటే 7 × 8 = 56. అంటే ఈ పజిల్‌లో ప్రతి సంఖ్యను దాని కంటే ఒకటి ఎక్కువ ఉన్న సంఖ్యతో గుణించాల్సి ఉంటుందన్న మాట. ఇదే లాజిక్‌ను చివరి వరకు కొనసాగిస్తే.. 6కు 6 × 7 = 42 వస్తుంది. మరి 5కు ఏం వస్తుంది? అనేది మన ప్రశ్న.

పై ప్యాటర్న్ ప్రకారం 5 × 6 = 30. కాబట్టి ఈ మ్యాథ్స్ పజిల్‌కు సరైన సమాధానం 30. ఇందులో పెద్దగా క్లిష్టమైన గణిత సూత్రం ఏమీ లేదు. ఇచ్చిన సంఖ్యల మధ్య ఉన్న ప్యాటర్న్‌ను త్వరగా గుర్తించడమే అసలు ఛాలెంజ్. 10×11, 9×10, 8×9, 7×8 అనే క్రమాన్ని గుర్తిస్తే.. సమాధానం సులభంగా చెప్పేయవచ్చు. ఇలాంటి నంబర్ పజిల్స్ మన గణిత పరిజ్ఞానంతో పాటు పరిశీలనా శక్తి, ప్యాటర్న్ రికగ్నిషన్, వేగంగా ఆలోచించే సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తాయి. మీరు కూడా ఈ పజిల్‌కు ముందే 30 అని గుర్తించగలిగితే.. మీ లాజికల్ థింకింగ్ బాగానే ఉందని చెప్పొచ్చు. ఆలస్యం ఎందుకు.. మీరు కూడా మీకు నచ్చిన వాళ్లకు ఈ పజిల్ సెండ్ చేయండి. వారు ఎంత సమయంలో సమాధానం చెబుతారో ఓసారి చూడండి.

ఈ మ్యాథ్స్ పజిల్‌కు సరైన సమాధానం 30:

10 = 110

9 = 90

8 = 72

7 = 56

6 = 42

5 = 30

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story