Extramarital Affair: డ్రైవర్‌తో ఎఫైర్..ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను ఏం చేసిందంటే..?
Extramarital Affair: రూ. 20 లక్షల బీమా సొమ్ము, ప్రియుడి కోసం భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, పాముతో కరిపించి చంపిన భార్య గుట్టును 24 గంటల్లో రట్టు చేసిన పోలీసులు.
Extramarital Affair: డ్రైవర్‌తో ఎఫైర్..ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను ఏం చేసిందంటే..?
Meerut Snake Bite: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా, హస్తినాపూర్‌కు చెందిన అతుల్ పంవార్ (35) అనే వ్యక్తికి, దామిని (30) అనే మహిళతో ఏడేళ్ల క్రితం (2019లో) ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. దంపతులిద్దరూ కలిసి స్థానికంగా 150 మంది పిల్లలున్న కృష్ణ కిడ్స్ పబ్లిక్ స్కూల్ అనే ప్లే స్కూలును విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అంతా బాగుందనుకుంటున్న సమయంలోనే ఆ కుటుంబంలోకి తుషార్ అలియాస్ నిక్కీ అనే స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఎంట్రీ ఇచ్చాడు.
స్కూల్ వ్యాన్ డ్రైవర్ తుషార్‌తో దామినికి ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. రోజురోజుకూ వీరి బంధం మితిమీరిపోవడంతో, దానికి అడ్డుగా ఉన్న భర్త అతుల్‌ను ఎలాగైనా వదిలించుకోవాలని దామిని నిర్ణయించుకుంది. ఇదే సమయంలో అతుల్ పేరిట ఉన్న రూ. 20 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులపై వీరి కన్ను పడింది.
భర్తను చంపేస్తే.. అటు ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చు, ఇటు రూ. 20 లక్షల డబ్బు కూడా వస్తుందని ఇద్దరూ కలిసి ఒక క్రూరమైన ప్లాన్ వేశారు. గత గురువారం రాత్రి దామిని తన ప్లాన్‌ను అమలు చేసింది. భర్త అతుల్‌కు రాత్రి తాగే పాలలో భారీ మోతాదులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అది తెలియని అతుల్ పాలు తాగి గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
అతుల్ స్పృహ కోల్పోయాడని నిర్ధారించుకున్న దామిని, వెంటనే ప్రియుడు తుషార్‌కు సమాచారం ఇచ్చింది. తుషార్ తన ఇద్దరు సహచరులైన సోను, ఉదయ్ కుమార్ అనే పాములు పట్టే వ్యక్తుల సహాయంతో ఒక విషపూరితమైన పామును ఇంటికి తెచ్చాడు. గాఢ నిద్రలో ఉన్న అతుల్ దుప్పట్లోకి ఆ పామును వదిలారు. ఆ పాము కాటు వేయడంతో అతుల్ నిద్రలోనే ప్రాణాలు విడిచాడు.
మరుసటి రోజు శుక్రవారం ఉదయం దామిని ఏమీ తెలియనట్లు పెద్దగా కేకలు వేస్తూ.. తన భర్తను పాము కాటేసిందని చెప్తూ హస్తినాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతుల్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మంచంపై పాము కనిపించినప్పటికీ, అతుల్ మరణంపై కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటన జరిగిన తీరు, అక్కడ లభించిన ఆధారాలు సాధారణ పాము కాటు ఘటనలకు భిన్నంగా ఉండటంతో సీనియర్ పోలీసు అధికారి అభిజిత్ కుమార్ నేతృత్వంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. దామిని మొబైల్ ఫోన్ కాల్ డేటా రికార్డులను పరిశీలించగా, వ్యాన్ డ్రైవర్ తుషార్‌తో ఆమె వందల సార్లు మాట్లాడినట్లు తేలింది. వెంటనే తుషార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతని మొబైల్ ఫోన్‌లో పాము ఫోటో దొరకడంతో అసలు నిజం బయటపడింది. పోలీసుల విచారణలో మరో షాకింగ్ నిజం కూడా వెలుగులోకి వచ్చింది.
అతుల్‌ను చంపడానికి వీరు పాము కాటు కంటే ముందే ప్రయత్నించారు. సుమారు 20 రోజుల క్రితం, తుషార్ తన ఎర్టిగా కారుతో అతుల్‌ను యాక్సిడెంట్‌గా చేసి చంపాలని చూశాడు. కానీ ఆ సమయంలో అతుల్ హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నాడు. ఆ రోజు ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా దామినియే అతుల్‌ను సముదాయించి అడ్డుపడినట్లు దర్యాప్తులో తేలింది.
కేసును అత్యంత వేగంగా చేధించిన పోలీసులు.. ప్రధాన నిందితురాలైన భార్య దామిని, ఆమె ప్రియుడు తుషార్‌తో పాటు, పామును సరఫరా చేసిన సోను, ఉదయ్ కుమార్‌లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఘటనా స్థలంలో దొరికిన పామును, నిందితుల మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.




