Volcano: ఇదెక్కడి విడ్డూరం.! అగ్నిపర్వతం నుంచి ఏటా రూ. 19 కోట్ల బంగారం

Volcano: అగ్నిపర్వతం బద్దలైతే లావా, బూడిద, పొగ రావడం సాధారణం. కానీ, ఒక అగ్నిపర్వతం మాత్రం రోజువారీగా ఏకంగా బంగారాన్ని వెదజల్లుతోంది.

Ravi
By Ravi
Published on: 1 July 2026 12:29 PM IST
Volcano
X

Volcano: ఇదెక్కడి విడ్డూరం.! అగ్నిపర్వతం నుంచి ఏటా రూ. 19 కోట్ల బంగారం

Volcano: అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భయంకరమైన లావా, దుమ్ము, ధూళి, పొగ కణాలు వెలువడటం సర్వసాధారణం. అయితే, ప్రపంచంలోని ఓ అగ్నిపర్వతం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ లావాతో పాటు ఏకంగా విలువైన బంగారాన్ని కూడా బయటకు వదులుతోంది. ఈ ఆసక్తికరమైన అగ్నిపర్వతం అంటార్కిటికా ఖండంలో ఉంది.

వివరాల్లోకి వెళితే.. అంటార్కిటికాలోని 'మౌంట్ ఎరెబస్' అనే అగ్నిపర్వతం రోజూ సుమారు 80 గ్రాముల స్వచ్ఛమైన బంగారు కణాలను వెదజల్లుతోంది. ఈ లెక్కన ఏడాదికి ఆ అగ్నిపర్వతం నుంచి వెలువడే బంగారం విలువ సుమారు రూ. 19 కోట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇంతకీ ఈ బంగారం అగ్నిపర్వతంలోకి ఎలా వచ్చిందంటే.. ఆ ప్రాంతంలోని భూగర్భంలో భారీ స్థాయిలో గోల్డ్ నిల్వలు ఉన్నాయి. అగ్నిపర్వతం లోపల ఉండే విపరీతమైన వేడికి ఆ బంగారం కరిగిపోయి ద్రవ, వాయు రూపంలో బయటికి వస్తుంది.

అయితే ఇక్కడ ఒక కఠినమైన విషయం ఏమిటంటే.. ఆ అగ్నిపర్వతం నుంచి వచ్చే ఈ బంగారు కణాలు కేవలం 20 నుంచి 60 మైక్రాన్ల పరిమాణంలో అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. (ఒక మీటర్ అంటే 10,00,000 మైక్రాన్లతో సమానం). ఇంత చిన్నగా ఉండి గాల్లో కలిసిపోవడం వల్లే ఆ బంగారాన్ని సేకరించడం మనుషులకు అస్సలు సాధ్యం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. చేతికి అందకపోయినా.. అగ్నిపర్వతం నుంచి బంగారం రావడం మాత్రం నిజంగా ప్రకృతి వింతే అని చెప్పవచ్చు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story