Number Puzzle: మెదడుకు పదును పెట్టే నంబర్ పజిల్.. సమాధానంను 10 సెకండ్లలో చెప్పగలరా?

Number Puzzle: సోషల్ మీడియాలో మెదడుకు పదును పెట్టే సంఖ్యల పజిల్స్‌కు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ప్రతి రోజు ఎన్నో పజిల్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Rishvik
Published on: 3 Aug 2026 8:14 PM IST
Number Puzzle
X

Number Puzzle: మెదడుకు పదును పెట్టే నంబర్ పజిల్.. సమాధానంను 10 సెకండ్లలో చెప్పగలరా?

Missing Number Puzzle: సోషల్ మీడియాలో మెదడుకు పదును పెట్టే సంఖ్యల పజిల్స్‌కు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ప్రతి రోజు ఎన్నో పజిల్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వైరల్ అవుతున్న ఓ నంబర్ పజిల్ నెటిజన్లను బాగా ఆలోచింపజేస్తోంది.

మూడు వృత్తాల్లో కొన్ని సంఖ్యలు ఇచ్చి.. చివరి వృత్తంలోని ఖాళీ స్థానంలో ఏ సంఖ్య రావాలో చెప్పాలని ఈ పజిల్‌లో ప్రశ్నించారు. చాలామంది సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. కొందరు మాత్రం చాలా ఈజీ అంటూ.. ఆన్సర్ చెప్పేశారు. ఆ నంబర్ పజిల్‌కు ఏంటి, దానికి సరైన సమాధానం ఏంటో చూద్దాం.

మొదటి వృత్తంలో 15, 21, 27 అనే సంఖ్యలు ఉన్నాయి. వీటిని నిశితంగా గమనిస్తే.. ప్రతి సంఖ్యను 3తో భాగిస్తే సరిపోతుంది. అప్పుడు వరుసగా 5, 7, 9 వస్తాయి. మొదటి వృత్తం లాజిక్ తెలిసిపోయింది.

15 ÷ 3 = 5

21 ÷ 3 = 7

27 ÷ 3 = 9

ఇప్పుడు రెండో వృత్తంలోని 10, 14, 18 సంఖ్యలు ఉన్నాయి. ఇవి మొదటి వృత్తంలోని సంఖ్యలకు 2/3 విలువలుగా కనిపిస్తాయి. లేదంటే 2తో భాగిస్తే ఆన్సర్ వస్తుంది. అంటే మొదటి వృత్తం నుంచి రెండో వృత్తానికి ఒకే నిష్పత్తి (2/3) ప్రకారం సంఖ్యలు మారాయి.

15 × 2/3 = 10

21 × 2/3 = 14

27 × 2/3 = 18

ఇక మూడో వృత్తాన్ని గమనిస్తే.. రెండో వృత్తంలోని ప్రతి సంఖ్యను 2తో భాగించారు. మూడో వృత్తంలో ఇప్పటికే 5, 9 ఉన్నాయి. కాబట్టి మధ్యలో ఉండాల్సిన సంఖ్య 7 అని స్పష్టమవుతోంది.

10 ÷ 2 = 5

14 ÷ 2 = 7

18 ÷ 2 = 9

ఈ పజిల్‌లో ప్రధానంగా గణిత సూత్రాల కంటే సంఖ్యల మధ్య ఉన్న ప్యాటర్న్‌ను గుర్తించడం ముఖ్యం. ఒకసారి ఆ ప్యాటర్న్ అర్థమైతే.. సమాధానం చాలా సులభంగా దొరుకుతుంది. ఈ పజిల్‌కు సరైన సమాధానం 7.

ఇక్కడ మరో ప్యాటర్న్ కూడా మనం అప్లై చేయొచ్చు. మొదటి వృత్తంలోని సంఖ్యలను.. 3 x 5 = 15, 3 x 7 = 21, 3 x 9 = 27 అవుతుంది. వృత్తంలోని సంఖ్యలను.. 2 x 5 = 10, 2 x 7 = 14, 2 x 9 = 18గా వస్తుంది. ఈ ప్యాటర్న్‌ను చివరి మూడో వృత్తాన్ని అమలు చేస్తే.. 31 x 5 = 5, 1 x 7 = 7, 1 x 9 = 9 అవుతుంది. 3, 2, 1 అంకెలతో 5, 7, 9లను గుణిస్తే కూడా ఆన్సర్ వస్తుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story