Passport: పౌరసత్వానికి పాస్‌పోర్ట్ గుర్తింపు కార్డు కాదు.. మరి ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలుసా?
Passport: పాస్‌పోర్ట్ అనేది భారతీయ పౌరసత్వానికి సరైన ఆధారం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Passport: పౌరసత్వానికి పాస్‌పోర్ట్ గుర్తింపు కార్డు కాదు.. మరి ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలుసా?
Passport: పాస్‌పోర్ట్ అనగానే అది ఒక పౌరుడి అత్యున్నత గుర్తింపు పత్రం అని చాలామంది భావిస్తుంటారు. అయితే, పాస్‌పోర్ట్ అనేది కేవలం విదేశీ ప్రయాణాలకు ఉపయోగపడే ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది భారతీయ పౌరసత్వానికి సరైన ఆధారం కాదని తేల్చి చెప్పింది. భారతీయులకు మాత్రమే జారీ చేసే ఈ డాక్యుమెంట్ పౌరసత్వ గుర్తింపునకు చెల్లదని చెప్పడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం, పాస్‌పోర్ట్‌పై వ్యక్తులకు ఎలాంటి యాజమాన్య హక్కు ఉండదు. దాన్ని ఎప్పుడైనా రద్దు చేసే పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందుకే దాన్ని పౌరసత్వానికి ప్రామాణికంగా పరిగణించరు. పాస్‌పోర్ట్‌తో పాటు మనం రోజువారీగా ఉపయోగించే ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులు కూడా పౌరసత్వాన్ని నిరూపించేందుకు చెల్లవని నిపుణులు స్పష్టం చేశారు. కేవలం ఓటు వేయడానికి, ప్రభుత్వ పథకాలు పొందడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయని వెల్లడించారు.
మరి భారతీయ పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించుకోవాలంటే ఏ డాక్యుమెంట్లు కావాలి? ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ధారించడానికి నివాస ధృవీకరణ పత్రం లేదా బర్త్ సర్టిఫికెట్ చూపించడం తప్పనిసరి. ఇవే దేశంలో అసలైన పౌరసత్వ ఆధారాలుగా చలామణి అవుతాయి. వీటితో పాటు వ్యక్తుల పేరిట ఉండే ప్రాపర్టీ డీడ్స్ లాంటి వాటిని సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌గా సమర్పించవచ్చు. ఇలాంటి కీలకమైన నిబంధనల గురించి ప్రతి ఒక్క పౌరుడూ కచ్చితంగా అవగాహన పెంచుకోవాలి.




