Free Electricity Scheme: 300 యూనిట్ల ఉచిత విద్యుత్.. రూ.78,000 సబ్సిడీ! 5 నిమిషాల్లో ఇలా దరఖాస్తు చేసుకోండి!

PM Surya Ghar Free Electricity Scheme: PM సూర్య ఘర్ పథకం ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 78 వేల సబ్సిడీ పొందండి. ఐదే నిమిషాల్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 July 2026 6:10 AM IST
Free Electricity Scheme
X

Free Electricity Scheme: 300 యూనిట్ల ఉచిత విద్యుత్.. రూ.78,000 సబ్సిడీ! 5 నిమిషాల్లో ఇలా దరఖాస్తు చేసుకోండి!

PM Surya Ghar Free Electricity Scheme: నెలనెలా వచ్చే కరెంటు బిల్లల టెన్షన్‌కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' (PM Surya Ghar Muft Bijli Yojana). మీ ఇంటి పైకప్పుపై (రూఫ్‌టాప్) సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉచిత విద్యుత్‌తో పాటు మిగిలిన కరెంటును ప్రభుత్వానికి విక్రయించి ఆదాయాన్ని కూడా పొందవచ్చు.

ఏకంగా రూ. 78,000 వరకు సబ్సిడీ:

దేశంలో కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు అమర్చాలనే లక్ష్యంతో 2024లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ పథకం కింద నమోదైన లబ్ధిదారులకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. ప్యానెళ్ల సామర్థ్యాన్ని బట్టి నేరుగా బ్యాంక్ ఖాతాలోనే కేంద్రం సబ్సిడీ జమ చేస్తుంది:

1 - 2 కిలోవాట్ (0-150 యూనిట్లు): రూ. 30,000 నుండి రూ. 60,000 వరకు సబ్సిడీ.

2 - 3 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ (150-300 యూనిట్లు): రూ. 60,000 నుండి గరిష్టంగా రూ. 78,000 వరకు సబ్సిడీ.

ఈ సోలార్ ప్యానెళ్ల ఆయుర్దాయం దాదాపు 25 సంవత్సరాలకు పైగా ఉంటుంది. అంటే ఒక్కసారి ఇన్‌స్టాల్ చేసుకుంటే కనీసం పాతికేళ్ల పాటు విద్యుత్ బిల్లుల బాధ ఉండదు.

అప్లై చేసుకోవడం ఎలా? (స్టెప్ బై స్టెప్ ప్రాసెస్):

కేవలం ఐదు నిమిషాల్లో అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు పూర్తి చేయవచ్చు:

♦ ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

♦ హోమ్‌పేజీలో 'Apply for Rooftop Solar' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

♦ మీ రాష్ట్రం, సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ (DISCOM) పేరును ఎంచుకోండి.

♦ కస్టమర్ నంబర్ (Electricity Consumer Number), మొబైల్ నంబర్, ఈమెయిల్ నమోదు చేసి లాగిన్ అవ్వండి.

♦ ఫారమ్‌లో అడిగిన వివరాలు నింపి RTS ప్యానెల్ కోసం సబ్మిట్ చేయండి.

సబ్సిడీ ఎలా వస్తుంది?

దరఖాస్తుకు ఆమోదం లభించిన తర్వాత డిస్కామ్ ఆమోదించిన వెండర్ ద్వారా సోలార్ ప్యానెళ్లు ఇన్‌స్టాల్ చేయించాలి. ఆ తర్వాత నెట్ మీటర్ కోసం అప్లై చేసుకోవాలి. డిస్కామ్ అధికారులు పరిశీలించి కమిషనింగ్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఆ సర్టిఫికేట్ వచ్చాక పోర్టల్‌లో బ్యాంక్ ఖాతా వివరాలు, క్యాన్సిల్డ్ చెక్ అప్‌లోడ్ చేస్తే సబ్సిడీ సొమ్ము నేరుగా మీ ఖాతాలో జమ అవుతుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story