Prehistoric Animals : డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు.!
Prehistoric Animals : మనం ప్రిహిస్టోరిక్ ఎరా లేదా పురాతన కాలం గురించి ఆలోచించినప్పుడు మనకు మొదటగా గుర్తొచ్చేవి డైనోసార్లు లేదా మ్యూజియంలో
Prehistoric Animals
Prehistoric Animals : మనం ప్రిహిస్టోరిక్ ఎరా లేదా పురాతన కాలం గురించి ఆలోచించినప్పుడు మనకు మొదటగా గుర్తొచ్చేవి డైనోసార్లు లేదా మ్యూజియంలో ఉండే ఫాసిల్స్ (శిలాజాలు). కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కోట్లాది ఏళ్ల క్రితం నాటి కొన్ని జీవులు ఇప్పటికీ మన మధ్యే తిరుగుతున్నాయి. ఐస్ ఏజ్ వచ్చినా, భూమి మీద ఎన్నో మార్పులు జరిగినా ఇవి మాత్రం ఏమాత్రం మారకుండా అలాగే సర్వైవ్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హార్స్షూ క్రాబ్ (Horseshoe crab)..
సముద్ర తీరాల్లో కనిపించే హార్స్షూ క్రాబ్స్ భూమి మీద ఉన్న అత్యంత పురాతన జీవులలో ఒకటి. ఇవి సుమారు 450 మిలియన్ ఏళ్ల క్రితం నుంచే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే డైనోసార్లు పుట్టకముందే ఇవి పుట్టాయి. వింతేమిటంటే, కోట్లాది ఏళ్లు గడిచినా వీటి షేప్, స్ట్రక్చర్ , బిహేవియర్ ఏమాత్రం మారలేదు. అందుకే వీటిని "లివింగ్ ఫాసిల్స్" (సజీవ శిలాజాలు) అని పిలుస్తారు.
కొమొడో డ్రాగన్ (Komodo dragon)..
ఇండోనేషియాలో కనిపించే కొమొడో డ్రాగన్ చూస్తుంటే మనకు పాత కాలం నాటి రాక్షస బల్లులు గుర్తొస్తాయి. ఇది ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అతిపెద్ద బల్లి జాతి. దీని మూలాలు మిలియన్ల ఏళ్ల నాటివి. దీని సైజు మాత్రమే కాదు, అది వేటాడే పద్ధతి కూడా చాలా పురాతనంగా, కాలిక్యులేటెడ్గా ఉంటుంది.
సీలకాంత్ (Coelacanth)..
చాలా కాలం వరకు శాస్త్రవేత్తలు సీలకాంత్ చేపలు డైనోసార్లతో పాటే అంతరించిపోయాయని అనుకున్నారు. కానీ 1938లో ఒక చేప సజీవంగా దొరకడంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది. సముద్రం లోతుల్లో ఉండే ఈ చేప రెక్కలు కాళ్లలాగా కనిపిస్తాయి. అంతరించిపోయిందనుకున్న జీవి మళ్ళీ కనిపించడం అంటే అది నిజంగా గ్రేట్ కదా.
అలిగేటర్ (Alligator)..
అలిగేటర్లు దాదాపు 150 మిలియన్ ఏళ్ల నుంచి భూమి మీద ఉన్నాయి. డైనోసార్ల కాలంలో ఇవి ఎలా ఉండేవో, ఇప్పుడు కూడా దాదాపు అలాగే ఉన్నాయి. వీటి బాడీ స్ట్రక్చర్ , నీటిలో వేటాడే స్టైల్ కోట్లాది ఏళ్ల నుంచి మారలేదు. కాలానికి తగ్గట్టుగా మారాల్సిన అవసరం లేకుండానే ఇవి సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి అంటే వీటి డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నాటిలస్ (Nautilus)..
సముద్రం లోతుల్లో ఉండే నాటిలస్ గురించి చాలా మందికి తెలియదు. దీని వంశం సుమారు 500 మిలియన్ ఏళ్ల క్రితం ప్రారంభమైంది. స్క్విడ్స్ లేదా ఆక్టోపస్ లాంటి ఇతర జీవులు కాలంతో పాటు చాలా డెవలప్ అయ్యాయి కానీ, నాటిలస్ మాత్రం ఏమాత్రం మారలేదు. తన షెల్ (చిప్ప) లో ఉండే గ్యాస్ చాంబర్స్ సాయంతో నీటిలో పైకి, కిందకి కదలడం అనే సింపుల్ సిస్టమ్ ద్వారా ఇది మిలియన్ల ఏళ్లుగా బతికేస్తోంది.




