Public WiFi Warning: హోటల్స్‌లో ఫ్రీ వైఫై వాడుతున్నారా..? మీ పని అయిపోయినట్టే..!

Public WiFi Warning: హోటళ్లు, ఎయిర్‌పోర్టుల్లో ఫ్రీ వైఫై వాడుతున్నారా? 'క్యాప్టివ్‌క్రంచ్' పేరుతో జరిగే అంతర్జాతీయ ఇంటర్నెట్ హైజాకింగ్ దాడులపై మైక్రోసాఫ్ట్ తీవ్ర హెచ్చరికలు చేసింది.

Naresh.k
Published on: 11 Aug 2026 8:36 AM IST
Public WiFi Warning
X

Public WiFi Warning: హోటల్స్‌లో ఫ్రీ వైఫై వాడుతున్నారా..? మీ పని అయిపోయినట్టే..!

Cyber Attack: హోటల్ లేదా ఎయిర్‌పోర్ట్‌లో అందుబాటులో ఉండే ఫ్రీ వైఫైకి కనెక్ట్ అయి హాయిగా బ్రౌజ్ చేస్తున్నారా..? అయితే మీకు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ బృందం ఓ ముందస్తు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికులు, హోటళ్లలో బస చేసే ప్రతినిధులనే లక్ష్యంగా చేసుకుని అత్యంత ప్రమాదకరమైన సైబర్ దాడులు జరుగుతున్నాయని స్పష్టం చేసింది.

ఈ అంతర్జాతీయ ఇంటర్నెట్ హైజాకింగ్ దాడికి మైక్రోసాఫ్ట్ క్యాప్టివ్‌క్రంచ్ అని పేరు పెట్టింది. ఈ దాడి వెనుక రష్యాకు చెందిన ప్రముఖ హ్యాకింగ్ గ్రూప్ మిడ్‌నైట్ బ్లిజార్డ్ ఉన్నట్లు భద్రతా నిపుణులు అనుమానిస్తున్నారు.

మనం హోటళ్లు, ఎయిర్‌పోర్టులు, షాపింగ్ మాళ్లు లేదా కాన్ఫరెన్స్ సెంటర్లలో ఉచిత వైఫైని కనెక్ట్ చేసిన వెంటనే సైన్-ఇన్ కావడం కోసం ఒక లాగిన్ పేజీ కనిపిస్తుంది. హ్యాకర్లు సరిగ్గా ఆ సిస్టమ్‌నే హ్యాక్ చేస్తున్నారు. వైఫైకి కనెక్ట్ కాగానే యూజర్లను తమ ఆధీనంలోకి తీసుకుని నకిలీ పాప్-అప్‌లతో ట్రాప్ చేస్తున్నారు.

మీ బ్రౌజర్ అప్‌డేట్ చేయండి, విండోస్ సెక్యూరిటీ స్కాన్ చేయండి లేదా గూగుల్ సెక్యూరిటీ చెక్ పూర్తయింది అనే నకిలీ మెసేజ్‌లతో యూజర్లను భయపెడతారు. ఆ పాప్-అప్‌లను క్లిక్ చేయగానే వినియోగదారుల కంప్యూటర్లు, ఫోన్లలోకి హానికర మాల్వేర్ సైలెంట్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది.

ఈ మాల్వేర్ సిస్టమ్‌లోకి ప్రవేశించిన మరుక్షణమే యూజర్ డివైజ్‌పై హ్యాకర్లు పూర్తి రిమోట్ కంట్రోల్ సాధిస్తారు. మీ ప్రమేయం లేకుండానే యూజర్ స్క్రీన్‌ను రికార్డ్ చేయడం, ఆడియో-వీడియో సంభాషణలను వినడం, స్క్రీన్‌షాట్లు తీయడం వంటివి చేస్తారు. కీబోర్డ్‌పై టైప్ చేసే ప్రతి అక్షరాన్నిరికార్డ్ చేస్తారు. బ్రౌజర్‌లో సేవ్ చేసి ఉంచిన పాస్‌వర్డ్‌లు, మైక్రోసాఫ్ట్ 365 లాగిన్ వివరాలు, కుకీలను దొంగిలిస్తారు.

ప్రయాణాల్లో ఉన్న ఉద్యోగుల ద్వారా ఆయా కంపెనీల రహస్య డేటాను సులువుగా సేకరిస్తున్నారు. హోటళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లోని ఉచిత వైఫైని వీలైనంత వరకు ఉపయోగించకపోవడమే శ్రేయస్కరం. అత్యవసరమైతే మీ సొంత మొబైల్ హాట్‌స్పాట్ లేదా ఎన్‌క్రిప్టెడ్ ప్రైవేట్ కనెక్షన్లను మాత్రమే వాడండి. వైఫై కనెక్ట్ అవుతున్న సమయంలో ఎలాంటి అప్‌డేట్‌లు లేదా సెక్యూరిటీ చెక్‌లు కోరినా క్లిక్ చేయవద్దు.

ప్రయాణాల్లో ఉన్నప్పుడు పబ్లిక్ నెట్‌వర్క్‌లలో బ్యాంకింగ్ లాగిన్‌లు, కార్పొరేట్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు ఎంటర్ చేయకండి. చిన్న పాటి నిర్లక్ష్యం మన వ్యక్తిగత, ఆర్థిక భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. అందుకే, ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story