Viral Video: మీ తెలివి తగలయ్యా.. స్మగ్లింగ్‌ ఇలా కూడా చేస్తారా.. పుష్పనే మించిపోయావ్‌గా

Viral Video: 'పుష్ప' సినిమాలో ఎర్రచందనాన్ని వినూత్న రీతిలో స్మగ్లింగ్ చేయడం మనం చూశాం. అదే తరహాలో నిజ జీవితంలో కూడా ఒక ముఠా స్మగ్లింగ్ చేస్తూ బుక్కయ్యారు.

Ravi
By Ravi
Published on: 4 July 2026 8:07 AM IST
Viral Video
X

Viral Video: మీ తెలివి తగలయ్యా.. స్మగ్లింగ్‌ ఇలా కూడా చేస్తారా.. పుష్పనే మించిపోయావ్‌గా

Viral Video: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో ఎర్రచందనాన్ని వినూత్న రీతిలో స్మగ్లింగ్ చేయడం మనం చూశాం. సరిగ్గా అదే తరహాలో నిజ జీవితంలో కూడా ఒక ముఠా ఏకంగా ట్రక్కు బంపర్‌ను మోడిఫై చేసి స్మార్ట్‌ఫోన్లను స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన ఆసక్తికరమైన ఘటన గురించి ఇక్కడ తెలుసుకోండి.

అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప' సినిమాలో ఎర్రచందనం దుంగలను పోలీసుల కళ్లు గప్పి ఎంత వినూత్నంగా స్మగ్లింగ్ చేశారో మనం చూశాం. అయితే, అచ్చం ఆ సినిమాలో చూపించిన తరహాలోనే నిజ జీవితంలో కూడా కొందరు స్మగ్లర్లు తమ విపరీతమైన తెలివితేటలను ఉపయోగించి ఏకంగా లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఆసక్తికరమైన ఘటన బ్రెజిల్ దేశంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ స్మగ్లింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

వివరాల ప్రకారం, బ్రెజిల్‌లోని అరౌకారియా ప్రాంతంలో స్మగ్లర్లు ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా 170 స్మార్ట్‌ఫోన్లను అక్రమంగా సరిహద్దులు దాటించేందుకు పక్కా ప్లాన్ వేశారు. అందుకోసం వారు తాము ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు వెనుక ఉండే బంపర్‌లో, సరిగ్గా స్మార్ట్‌ఫోన్ డబ్బాలు పట్టే విధంగా కొన్ని ఇనుప బాక్సులను అత్యంత సీక్రెట్‌గా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అందులో ఫోన్లను పెట్టి తరలిస్తున్నారు.

అయితే, వాహనాల తనిఖీలో భాగంగా ఆ ట్రక్కును ఆపిన పోలీసులు.. ఆ బంపర్ దగ్గర చేసిన మార్పుల్లో కాస్త తేడా ఉండటాన్ని నిశితంగా గమనించారు. వెంటనే అనుమానంతో ఆ బంపర్‌ను తీసి చెక్ చేయగా పోలీసులు సైతం అవాక్కయ్యారు. అందులో అక్రమంగా తరలిస్తున్న సుమారు లక్ష డాలర్ల (అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 95 లక్షల) విలువ చేసే 170 ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు బయటపడ్డాయి. వాటిని సీజ్ చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి తెలివి చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.


Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story