Viral News : రాహుల్‌ను ట్రోల్ చేద్దామనుకుంది.. తన గ్రామర్‌నే నెటిజన్లు ట్రోల్ చేశారు.!

Viral News : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించేందుకు చేసిన ఒక ప్రయత్నం సోషల్ మీడియాలో పూర్తిగా ఎదురుతిరిగింది. ఇంగ్లీష్, ఎడ్యుకేషన్ వంటి సబ్జెక్టులలో

G Krishna
Published on: 31 July 2026 8:47 PM IST
Arpita-Chatterjee
X

Arpita-Chatterjee

Viral News : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించేందుకు చేసిన ఒక ప్రయత్నం సోషల్ మీడియాలో పూర్తిగా ఎదురుతిరిగింది. ఇంగ్లీష్, ఎడ్యుకేషన్ వంటి సబ్జెక్టులలో రెండు మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయని గర్వంగా చెప్పుకున్న ఒక మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్, తాను చేసిన పోస్ట్‌లోనే తీవ్రమైన గ్రామర్ తప్పులు చేయడంతో నెటిజన్ల నుంచి ఊహించని ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది.

అసలేం జరిగింది.?

పశ్చిమ బెంగాల్‌కు చెందిన అర్పిత ఛటర్జీ అనే మహిళ తనను తాను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పరిచయం చేసుకుంటూ 'X' (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ గతంలో "అంధభక్తులు" (Andhbhakts) అనే పదంపై చేసిన వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ ఆమె రాసుకొచ్చారు.

ఆమె తన పోస్ట్‌లో.. "డియర్ రాహుల్ గాంధీ, నేను ఒక గర్వించదగ్గ అంధభక్తురాలిని , అసిస్టెంట్ ప్రొఫెసర్‌ని. నాకు ఇంగ్లీష్, ఎడ్యుకేషన్ రెండింట్లోనూ మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయి, బి.ఎడ్ పూర్తి చేసి ప్రస్తుతం పీహెచ్‌డీ కూడా చేస్తున్నాను. మీ ప్రకారం అంధభక్తులు అంటే ఇడియట్స్ కదా.. మరి నేను ఇడియట్‌నా? మీకు అంత ఖచ్చితంగా తెలుసా?" అంటూ ప్రశ్నించారు.

విమర్శల స్థానంలో.. గ్రామర్ పాఠాలు..

రాహుల్ గాంధీపై ఒక బలమైన రాజకీయ విమర్శ చేయాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ పోస్ట్ పెట్టినప్పటికీ, నెటిజన్లు మాత్రం ఆమె లేవనెత్తిన ప్రశ్నల కంటే ఆమె వాడిన భాషపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో పిజి (పోస్ట్ గ్రాడ్యుయేషన్) చేసి, కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి రాసిన వాక్యాల్లోనే ప్రాథమిక గ్రామర్ తప్పులు ఉండటాన్ని నెటిజన్లు క్షణాల్లో పసిగట్టారు.

విమర్శలను పక్కనబెట్టి ఆమెకు ఇంగ్లీష్ గ్రామర్ సవరణలు చేస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఆమె వాడిన "having two master's degree" అనే పదం బహువచనం (Plural) కాబట్టి "having two master's degrees" అని ఉండాలని, అలాగే "pursuing PhD" అనే దానికి బదులుగా "pursuing a PhD" అని రాయాలని నెటిజన్లు ఆధారాలతో సహా ఎత్తిచూపారు.

ఐరనీపై సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు

డిగ్రీల ప్రస్తావన తెస్తూ పొలిటికల్ కామెంట్ చేద్దామనుకుంటే, అది కాస్తా సోషల్ మీడియాలో ఉచిత 'గ్రామర్ క్లాస్'గా మారిపోవడంపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ఇంగ్లీష్ ప్రొఫెసర్ స్థానంలో ఉండి ఇలాంటి తప్పులు చేయడం అత్యంత విడ్డూరంగా (ఐరనీ) ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. రాజకీయంగా కౌంటర్ ఇద్దామనుకున్న ప్రయత్నం చివరికి ఆమె విద్యా అర్హతలపైనే చర్చకు దారితీయడం విశేషం.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story