viral-video : హైవేపై భోజనం అంటూ రచ్చ.. అసలు నిజం తెలిస్తే షాక్..

viral-video : రాజస్థాన్‌లో ఓ కుటుంబం హైవేపైనే కూర్చొని భోజనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 20 నుంచి 25 మంది కలిసి నేషనల్

G Krishna
Published on: 1 Sept 2026 5:24 PM IST
viral-video
X

viral-video

Viral Video : రాజస్థాన్‌లో ఓ కుటుంబం హైవేపైనే కూర్చొని భోజనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 20 నుంచి 25 మంది కలిసి నేషనల్ హైవే-27 పక్కన భోజనం చేయడం కనిపించడంతో.. హైవేను ఆక్రమించి పిక్నిక్ చేసుకున్నారంటూ నెటిజన్లు విమర్శలు చేశారు. అయితే, ఈ వీడియో వెనుక అసలు విషయం తెలుసుకునేందుకు మీడియా ఆరా తీయగా పూర్తి భిన్నమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది.

మెనాల్ వాటర్‌ఫాల్ నుంచి తిరిగొస్తూ..

చిత్తోర్‌గఢ్‌కు చెందిన శివ్ ప్రకాశ్ తన కుటుంబంతో కలిసి ఆగస్టు 12న హరియాలీ అమావాస్య సందర్భంగా మెనాల్ వాటర్‌ఫాల్‌కు వెళ్లారు. తిరిగి చిత్తోర్‌గఢ్‌కు వస్తున్న సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసేందుకు నేషనల్ హైవే-27పై ఉన్న నిర్ణీత పార్కింగ్, రెస్ట్ ఏరియాలో ఆగారు.

కేవలం 15 నిమిషాలే..

దాదాపు 20 నుంచి 25 మంది కుటుంబ సభ్యులు తమ వాహనాన్ని హైవేకు ఎడమవైపున ఉన్న పార్కింగ్ ప్రాంతంలో నిలిపారు. అనంతరం అక్కడే కూర్చొని భోజనం చేశారు. తాము ప్రధాన రహదారిపై కూర్చోలేదని, హైవేను ఎలాంటి విధంగానూ బ్లాక్ చేయలేదని శివ్ ప్రకాశ్ స్పష్టం చేశారు. కేవలం 15 నిమిషాల పాటు అక్కడ ఆగి భోజనం చేసినట్లు తెలిపారు.

NHAI కూడా క్లారిటీ ఇచ్చింది

వైరల్ వీడియోపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు కూడా స్పందించారు. ఈ వీడియో కోటా-చిత్తోర్‌గఢ్ హైవేపై చిత్రీకరించిందేనని ఉదయ్‌పూర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ చౌదరి తెలిపారు. అయితే వీడియోలో కనిపిస్తున్న కుటుంబం ప్రధాన హైవేపై కాకుండా నిర్దేశిత పార్కింగ్ ప్రాంతంలోనే కూర్చుందని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం

వాస్తవానికి ప్రయాణికులు ఆగి విశ్రాంతి తీసుకోవడంతో పాటు ట్రక్కులను పార్క్ చేసుకునేందుకు కూడా ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. కానీ వీడియోలోని అసలు సందర్భం తెలియకపోవడంతో.. కుటుంబం ఏకంగా హైవేపైనే కూర్చొని భోజనం చేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

హరియాలీ అమావాస్య సంప్రదాయంలో భాగమే..

మేవార్ ప్రాంతంలో హరియాలీ అమావాస్య సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి బయటకు వెళ్లడం, పిక్నిక్‌లు చేసుకోవడం ఆనవాయితీగా ఉందని శివ్ ప్రకాశ్ తెలిపారు. అదే సంప్రదాయంలో భాగంగా కుటుంబంతో కలిసి బయటకు వెళ్లామని చెప్పారు. దీంతో వైరల్ వీడియోపై వచ్చిన విమర్శలకు అసలు వాస్తవం వెలుగులోకి వచ్చిన తర్వాత తెరపడింది.





G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story